Medak- Kamareddy : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనంత అత్యంత భారీ వర్షాలు కురిశాయి. రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఈ మేరకు రెండు జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సాయంత్రం వరకు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు.
Read Also : Pocharam Project : ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు.. తెగే ప్రమాదం..
రేపు, ఎల్లుండి కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పరిస్థితిని బట్టి ఎల్లుండి కూడా స్కూల్స్ కు సెలవు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జిల్లాల్లోని అన్ని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలు నీట మునిగాయి. మెదక్, కామారెడ్డి పట్టణాలు నీటిలోనే ఉన్నాయి. చాలా చోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్ లు తెగిపోయాయి. వాగుల సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగుల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Read Also : KTR : తెలంగాణ నీటమునిగితే సీఎం బీహార్ లో ఉంటారా.. కేటీఆర్ ట్వీట్