దారుణాలు పెరిగిపోతున్నాయి.. మానవత్వం మంటగలిసిపోతోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములూరు టిడిపికి చెందిన ఉప సర్పంచ్ శీని ప్రసాద్ హత్యకు గురయ్యాడు.మండు లొగిళ్లు ఇంటిలో ఒంటరిగా ఉంటున్న శివప్రసాద్ ను అర్థరాత్రి దుండగులు హత్య చేశారు. తలపైన, మెడ మీద గాయాలు ఉన్నాయి. పీక నులిమి, తలను గోడకు వేసి కొట్టి చంపినట్లుగా ఉంది. దశాబ్దాల కాలంగా టిడిపి నాయకుడిగా ఉన్న శివప్రసాద్ ప్రస్తుతం వేములూరు ఉప సర్పంచ్ గా ఉన్నారు. రాత్రి పదిన్నర గంటల వరకు అందరితో మాట్లాడి ఇంటిలోకి పడుకున్న శివ ప్రసాద్ తెల్లవారే సరికి మండువాలో రక్తపు మడుగులో శవమై ఉన్నారు. ఈ ఘటన చూసి స్థానిక టిడిపి నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొవ్వూరు రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.
డాగ్ స్క్వాడ్ ను తీసుకుని వస్తున్నారు. ఈ ఘటన వేములూరులో కలకలం రేపుతుంది. స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. శివప్రసాద్ కు భార్యా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యా తల్లికి ఒంటిపై బాగోలేదని జంగారెడ్డిగూడెం వెళ్ళింది. కుమారుడు రాజమండ్రిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. కుమార్తె ఏలూరులోని బిఫాంసి కాలేజీలో చదువుతుంది. ఇంటిలో ఒంటరిగా ఉంటున్న శివప్రసాద్ ను దుండగులు హత్య చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: USA: భారత రాయబార కార్యాలయం వద్ద ఖలిస్తానీ మద్దతుదారుల ఆందోళన.. భారత జర్నలిస్టుపై దాడి..