Ameenpur: అమీన్పూర్లో ముగ్గురు పిల్లలను చంపిన తల్లి.. ఎస్పీ రియాక్షన్..!
- సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో తీవ్ర విషదం..
- ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యయత్నం..
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి రజిత స్టేట్మెంట్ రికార్డ్..
- ఏమైంది అని పోలీసులను ఎదురు ప్రశ్నించిన రజిత..
- రాత్రి షాప్ నుంచి తెచ్చుకున్న పెరుగుతో నలుగురు అన్నం తిన్నాం: రజిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ameenpur: అమీన్పూర్లో పిల్లల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. చావు బతుకుల మధ్య ఉన్న రజిత స్టేట్మెంట్ ను పోలీసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాత్రి షాప్ నుంచి పెరుగు తెచ్చుకున్నాం.. ఆ పెరుగుని నలుగురం కలిసి తిన్నాం.. నా గొంతులో ఏదో పట్టుకున్నట్లు అయింది.. అందరం కింద పడిపోయాం.. ఏం జరిగిందో నాకు తెలియదు.. నా పిల్లలకి ఏమైనా అయిందా అని రజిత అడిగింది. అయితే, తాను ఎలాంటి విష పదార్థాలు చిన్నారులకు ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. చిన్నారులు మృతి చెందడం, ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చెందడం వెనుక ఉన్న కారణాలేంటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెరుగు అన్నం తిన్నామని పోలీసులకు చెప్పిన రజిత.. ఇంట్లో డస్ట్ బిన్ లో పెరుగు ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. హెరిటేజ్ పెరుగు ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్ ఇఫ్తార్ విందు.. ముస్లింలకు ట్రంప్ ప్రత్యేక కృతజ్ఞతలు
Also Read
- Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
- Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!
- Jaggareddy: సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. సీఐ తీరుపై జగ్గారెడ్డి ఫైర్.. రంగంలోకి ఎన్నికల సంఘం!
- JaggaReddy: 60 సీట్లు ఉన్న బస్సులో 100 మంది మహిళలు ఎక్కితే గొడవలు కావా..?
అలాగే, చిన్నారుల తండ్రి చెన్నయ్యను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల మృతి మిస్టరీగా ఉండటంతో చెన్నయ్యను ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు, తగాదాలు లేవని స్థానికులు చెప్తున్నారు. రజిత చాలా మంచిదని, పిల్లలను కూడా ప్రేమగా చూసుకుంటుందని తెలిపారు. అయితే, చెన్నయ్యకు రజిత రెండవ భార్య.. చెన్నయ్య, రజిత దంపతుల సంతానమే ఈ ముగ్గురు చిన్నారులు అని స్థానికులు పేర్కొన్నారు.
Read Also: Minister Narayana: మున్సిపాలిటీల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్.. మంత్రి నారాయణ సమీక్ష
ఇక, ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా ఎస్సీ పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ.. ఏం జరిగింది అన్న విషయం ఇంకా పూర్తిస్థాయిలో తెలవదు.. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఎలా చనిపోయారన్న విషయం తెలుస్తుంది.. రజిత, చెన్నయ్యలను ఇంకా పూర్తి స్థాయిలో విచారించలేదు.. ఏ విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. కాగా, రాఘవేంద్ర కాలనీలోని ఇంటి నుంచి మరికొద్ది సేపట్లో చిన్నారులను మార్చురీకి తరలించనున్నాం.. చిన్నారులు చనిపోవడానికి గల కారణాలు పోస్టుమార్టం రిపోర్ట్ లో తెలియనుంది.. ఈ ఘటనలో పోస్టుమార్టం రిపోర్టే కీలకం కానుందని ఎస్పీ పరితోశ్ పంకజ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!