BJP Sangareddy : బీజేపీ శిక్షణ శిబిరంలో రచ్చ.. జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ తీవ్ర ఆగ్రహం.!
- సంగారెడ్డి బీజేపీ శిక్షణ శిబిరంలో ఉద్రిక్తత
- జిల్లా అధ్యక్షురాలిపై మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఆగ్రహం
- "పార్టీ మీ అబ్బ సొత్తు కాదు" అంటూ ఫైర్
- సమావేశం నుంచి బయటకు వెళ్లిన నేతలు, కార్యకర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Sangareddy : సంగారెడ్డి జిల్లా BJP అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ శిక్షణ శిబిరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేదికపైనే నేతల మధ్య మాటల యుద్ధం నడవడంతో ఒక్కసారిగా వాతావరణం రసాభాసగా మారింది. జిల్లా పార్టీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ మధ్య బహిరంగంగానే తీవ్ర వాగ్వివాదం జరిగింది. పార్టీ ముఖ్య నాయకులు చూస్తుండగానే నేతలు ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో ఈ సమావేశం కాస్తా రసాభాసగా ముగిసింది.
సమావేశం కొనసాగుతున్న సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ ఎంపీ బీబీ పాటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిపై ఆయన మండిపడ్డారు. “బీజేపీ పార్టీ మీ అబ్బ సొత్తు కాదు” అంటూ తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీబీ పాటిల్, అవమానం జరిగిన చోట తాను ఉండలేనంటూ సమావేశం మధ్యలోనే అక్కడి నుండి విసవిసా వెళ్లిపోయారు. సీనియర్ నాయకుడైన పాటిల్ ఇలా అర్ధాంతరంగా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లడం అక్కడ ఉన్న శ్రేణులను విస్మయానికి గురిచేసింది.
Also Read
- Harish Rao : 5,420 కోట్ల 'ట్రూ అప్' భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
మరోవైపు ఇదే వేదికపై పటాన్చెరు బీజేపీ యువనేత నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ సైతం జిల్లా అధ్యక్షురాలితో ఘర్షణకు దిగారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, ఈ సమావేశానికి అధికారికంగా ఆహ్వానించకపోవడంపై ఆయన నిలదీశారు. ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో ఆశిష్ గౌడ్ వాదించారు. అనంతరం ఆయనతో పాటు పటాన్‌చెరుకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా సమావేశం నుండి నిరసనగా బయటకు నడిచారు. ఈ వరుస పరిణామాలు సంగారెడ్డి జిల్లా బీజేపీలో ఉన్న వర్గపోరును మరోసారి బహిర్గతం చేశాయి.
తాజావార్తలు
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!