Pashamylaram Blast: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని పాశమైలారంలో జరిగిన పేలుడులో సుమారు 40 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో మృతులకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తనిఖీ విభాగాలు సరిగ్గా పని చేయక పోవడం వల్ల ప్రమాదం జరిగింది అని ఆరోపించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంతో పాటు నిర్లక్య ధోరణి వల్ల ప్రమాదం చోటు చేసుకుంది.. ఇది ఫ్యాక్టరీ యాజమాన్యం జరిపిన హత్య.. రాష్ట్రంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలపై తనిఖీ విభాగాలను ఏర్పాటు చేయాలని సీపీఐ నారాయణ కోరారు.
Read Also: Jai Shankar: అందుకే పాక్ పహల్గామ్ దాడి చేసింది.. ట్రంప్ వాదన అంతా తప్పు.
అలాగే, ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. మదనపల్లి హార్సిలీ హిల్స్ రామ్ దేవ్ బాబాకు అప్పగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. అది పతంజలి కాదు అనైతిక పతంజలి అంటూ విమర్శలు గుప్పించారు. కార్పొరేట్లకు మించిన కార్పొరేట్ రామ్ దేవ్ బాబా.. కార్పొరేట్ ముసుగులో ఉన్న దొంగ బాబాకు హార్సిలీ హిల్స్ ను రామ్ దేవ్ బాబాకు ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నారు. టూరిజం, యోగా అభివృద్ధికి ఇస్తున్నారనడం సరికాదు.. జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ కి ఇచ్చి ఉంటే బాగుండేది అన్నారు. మదనపల్లి హార్సిలీ హిల్స్ రామ్ దేవ్ బాబుకు ఇవ్వడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.. బాబా రామ్ దేవ్ ను ఏపీకి రానివ్వమని కె. నారాయణ తేల్చి చెప్పారు.