TS Government: జేపీఎస్‌లకు సర్కార్ గుడ్‌న్యూస్.. కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Government: తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ సర్కార్ శుభవార్త. రెగ్యులరైజ్ చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) వేతనాలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేసి నాలుగో తరగతి కార్యదర్శులుగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే కొత్త, పాత వేతనాలు ఇవ్వకపోవడంతో గందరగోళం నెలకొంది. దీనిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా స్పందించారు. ఆయా జేపీఎస్ ల వేతనాలకు సంబంధించిన బిల్లులను వెంటనే సిద్ధం చేసి మండల ఉప ఖజానా కార్యాలయాలకు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. బిల్లుల ఆధారంగా ఎస్టీవీల ద్వారా వేతనాలు చెల్లించాలని జిల్లా ట్రెజరీ అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. నాలుగో తరగతి కార్యదర్శులుగా కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు అందుతాయి.
Read also: Balakrishna: చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యే
Also Read
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రంలో 2019 ఏప్రిల్‌లో జేపీఎస్ నియామకం జరిగిందని.. అప్పట్లో మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, ఆ తర్వాత సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేస్తారనే షరతుతో ఉద్యోగాలు ఇచ్చారు. నెలకు రూ.15 వేల వేతనంతో మూడేళ్లపాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. కానీ మూడేళ్లు దాటినా రెగ్యులరైజ్ కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు ఇటీవల రోడ్డున పడ్డారు. విధులను బహిష్కరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో చర్చించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. లక్ష్యంలో మూడింట రెండొంతులు సాధించిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరిని గ్రేడ్-4 కార్యదర్శులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేశారు. దీని ప్రకారం వారికి నెలకు రూ.32 వేలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.
Viral Video: దరిద్రం నడినెత్తిన డ్యాన్స్ చేయడం అంటే ఇదేనేమో..
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!