గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక విద్యను అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన బాసర ట్రిపుల్ ఐ టి లో భవిష్యత్ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ను ఆదేశించారు. సోమవారం నాడు బాసర ట్రిపుల్ ఐ టి పై తన కార్యాలయంలో సమీక్షించారు. విద్యార్థులకు గతంలో హామీ ఇచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను ఇప్పటికే మంజూరు చేశామని మంత్రి తెలిపారు. బోధన, భోజన, వసతి పరంగా భవిష్యత్ లో సమస్యలు ఉత్పన్నం కాకుండా విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు తీసుకునే చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
Presidential Election 2022: ముగిసిన పోలింగ్.. 99.18% ఓటింగ్ నమోదు
బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో నెలకొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అక్కడి సమస్యలను ఎన్టీవీ వెలుగులోకి తెచ్చింది. ఈ సమస్యలు పరిష్కరించాలంటూ గత నెలలో సుమారు వారం రోజుల పాటు స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వివిధ పార్టీలు విద్యార్ధుల ఆందోళనకు మద్దతు పలికాయి. విద్యార్ధులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హమీ ఇచ్చింది. స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్ధులకు హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్ ఆందోళన విరమించారు.
ఇదంతా అయిపోయాక మళ్ళీ బాసర ఐఐఐటీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి కలుషిత ఆహారం తిని విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడంతో అక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం అయింది. ఇది ముగిశాక అక్కడ రెగ్యులర్ వీసీ స్థానంలో ఇన్‌చార్జ్ వీసీని నియమించింది ప్రభుత్వం. దీనిపై విద్యార్ధిలోకం భగ్గుమంది. విద్యార్ధులు నిరసనకు దిగారు. తాము కోరుకున్నది ఇన్‌చార్జ్ వీసీ కోసం కాదని రెగ్యులర్ పీసీ కోసమని విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనిఫామ్స్, మెస్ కాంట్రాక్ట్ రద్దు, ల్యాప్‌టాప్‌లు, ఛాన్స్‌లర్‌ల భర్తీ వంటి ప్రధాన డిమాండ్‌లు పరిష్కారం కాలేదని, అవి పరిష్కారం అయ్యేందుకు ఈ నెల 24వ తేది వరకు గడువు విధించారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే 25వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని విద్యార్ధులు వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ముందు వైఎస్ ఆర్ టీపీ నాయకులు ధర్నాకు దిగారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్ళే క్రమంలో ప్రధాన గేటు వద్ద నాయకులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు..దీంతో గేటు ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్ధి సంఘ నేతలను అరెస్ట్ చేశారు. ఈక్రమంలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.
NEET 2022: ఇవేం చర్యలు..? అమ్మాయిల లో దుస్తులు కూడా విప్పించారు