తెలంగాణ విద్యారంగంలో గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను తెలిపారు. సచివాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు విద్యారంగంలోని విజయాలకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు.