Sabitha Indra Reddy: ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి సబిత సమీక్ష.. వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabitha Indra Reddy Review Meeting On Intermediate Education: మంగళవారం ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కాలేజీల్లో అవసరమైన కొత్త భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసినా.. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పనులు పూర్తి చేయకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌కు ఆదేశాలు జారీ చేశారు. కాలేజీ నిర్వహణ అవసరాలు, ల్యాబ్‌ల ఆధునికీకరణ పనుల కోసం మరో రూ.4.43 కోట్లు మంజూరు చేశామని.. ఈ పనులన్నీ వెంటనే చేపట్టాలని చెప్పారు. విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై కూడా సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆపరేటర్ల సహాయంతో.. శుక్రవారం నాటికి పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయాలని సూచించారు.
Padi Kaushik Reddy: ఈటల రాజేందర్‌కి ఎమ్మెల్సీ కౌశిక్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పాలని డిమాండ్
Also Read
- Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
- Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
- CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
ఇదే సమయంలో.. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిందనే ఆరోపణల్ని మంత్రి సబిత ఖండించారు. దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను తెలంగాణ రాష్ట్రంలోనే ఉచితంగా అందిస్తున్నామని.. ప్రవేశాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. 119 జ్యోతిరావు పూలే పాఠశాలలను, 38 కెజీబీవీలను, 2 గిరిజన గురుకులాలను ఇంటర్మీడియేట్ వరకు అప్‌గ్రేడ్ చేశామని అన్నారు. వీటిలో కొంతమంది విద్యార్థులు చేరారన్నారు. ప్రవేశాల తుది గడువు ఇంకా పూర్తి కాలేదని, గడువు ముగిసే నాటికి గత సంవత్సరంతో పోలిస్తే అధిక ప్రవేశాలు జరుగుతాయని తెలిపారు. అయితే.. మారుమూల జిల్లాల్లో విద్యార్థులు అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధిస్తుండగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించి.. ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
Suicide Blast: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురికి గాయాలు
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!