Rajnath Singh: హైదరాబాద్‌కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు హైదరాబాద్‌కు రానున్నారు. దేశ రక్షణ రంగంలో కీలక మైలురాళ్లు, మేధావులతో చర్చలు, వాయుసేన అకాడమీలో పరేడ్ వంటి వరుస కార్యక్రమాలతో ఆయన షెడ్యూల్ అత్యంత బిజీగా సాగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలకనున్నాయి. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 26కు చేరుకుని, మధ్యాహ్నం రెండు గంటల వరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
అనంతరం రక్షణ రంగ పరిశోధనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఆయన DRDLకు వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రతిష్టాత్మకమైన ‘కుషా కాంప్లెక్స్’ను ప్రారంభించి, అత్యాధునిక ల్యాబొరేటరీలను సందర్శించి శాస్త్రవేత్తలతో ముచ్చటిస్తారు. సాయంత్రం వేళ గాయత్రి గార్డెన్స్‌లో నిర్వహించే మేధావుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన 12 ఏళ్ల సుపరిపాలన, దేశాభివృద్ధిపై మేధావులతో ముఖాముఖి నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరిస్తారు. రాత్రి 6:25 గంటలకు దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి చేరుకుని, అక్కడ శిక్షణ పొందుతున్న క్యాడెట్లు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేసి, అకాడమీలోని ‘రాష్ట్రకూట్’ భవనంలో రాత్రి బస చేస్తారు.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
రేపు ఉదయం రాజ్‌నాథ్ సింగ్ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరిస్తారు. భారత గగనతల రక్షణ కవచంలో కొత్తగా చేరబోతున్న యోధుల పరేడ్‌ను సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేస్తారు. ఈ ఉత్సాహభరితమైన కార్యక్రమం ముగిసిన అనంతరం, ఉదయం 11:10 గంటలకు అకాడమీ నుంచి నేరుగా ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!