ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC : మహిళల క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ వేదికగా 2026లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ప్రైజ్ మనీని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నీ జూన్ 12 నుంచి ప్రారంభం కానుండగా.. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్‌గా నిలవనుంది. ఈసారి మొదటిసారిగా 12 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. ఇంగ్లాండ్ లోని ఏడు వేదికల్లో మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
విజేతకు రూ.22 కోట్లకుపైగా :
ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. 2026 మహిళల టీ20 ప్రపంచకప్ విజేత జట్టుకు 2.34 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.22 కోట్లకుపైగా) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. రన్నరప్ జట్టుకు 1.17 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.11 కోట్ల బహుమతి లభించనుంది. అలాగే టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు 247,500 డాలర్లు (రూ.2 కోట్లు) అందజేయనున్నారు. సెమీఫైనల్ దశలో ఓడి నిష్క్రమించే జట్లకు కూడా నిరాశ ఎదురుకాకుండా దాదాపు రూ.6.56 కోట్ల బహుమతి ఇవ్వనున్నారు.
Also Read
- రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
- Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
లీగ్ మ్యాచ్‌లకూ ప్రత్యేక బోనస్:
నాకౌట్ మ్యాచ్‌లకే కాకుండా లీగ్ దశలో కూడా జట్లకు ప్రోత్సాహక నగదు బహుమతులు ప్రకటించింది ఐసీసీ. గ్రూప్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచిన జట్టుకు సుమారు రూ.29 లక్షల బోనస్ అందజేయనుంది. దీంతో ప్రతి మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత మహిళల జట్టు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఈసారి తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. టైటిల్ ఫేవరెట్ జట్లలో భారత్ ఒకటి.
మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో మొదటిసారి 12 జట్లు పోటీపడుతున్నాయి. గతంలో 10 జట్లు మాత్రమే పాల్గొనగా, ఈసారి టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూపులోని మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూపులు:
గ్రూప్-1: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్.
గ్రూప్-2: ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
-
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!