Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
- రైతు భరోసా కింద తాజా నిధుల విడుదల
- 74 లక్షల మంది రైతులకు లబ్ధి
- 1.45 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం
- మొత్తం సాయం రూ.8,759 కోట్లకు చేరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని రైతులకు పెట్టుబడి సాయం అందించే క్రమంలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రైతు భరోసా పథకం కింద నూతనంగా రూ. 1,009 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయగా, ఆ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. గత ప్రభుత్వం రైతు బంధు నిధుల కోసం 169 రోజులు తిప్పించుకునేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లు ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. ఇప్పటివరకు 74 లక్షల మంది రైతులకు, 1.45 కోట్ల ఎకరాల భూములకు గానూ మొత్తం రూ. 8,759 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించామన్నారు. అలాగే మహిళా సంక్షేమానికి కట్టుబడి కేవలం రెండున్నర ఏళ్లలోనే మహిళలకు రూ. 67,000 కోట్ల రుణాలను అందించామని, పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ రైతును రాజుగా చూస్తున్నామని భట్టి స్పష్టం చేశారు.
మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఒక్కటి కూడా దెబ్బతినలేదని, కానీ బీఆర్ఎస్ నాయకులు రూ. 27,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును రూ. 1,47,000 కోట్లకు పెంచి, కట్టక కట్టక కట్టిన కాళేశ్వరాన్ని కూల్చేశారని మండిపడ్డారు. హరీష్ రావు అబద్ధాలన్నీ ప్రోగేసి మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ చేసిన అప్పులు, వడ్డీలు కడుతూనే తాము ఉద్యోగుల బిల్లులు క్లియర్ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ నాయకుల భవిష్యత్తు అయిపోయిందని, వారు మళ్లీ మాయమాటలతో ఊళ్లలోకి వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని, తరిమి తరిమి కొడతారని భట్టి విక్రమార్క హెచ్చరించారు.
Also Read
- Rythu Bharosa : రైతులకు పెట్టుబడి సాయం.. మరో రూ.1,009 కోట్లు విడుదల
- AI Training : మైనారిటీ విద్యార్థులకు ‘ఏఐ’ శిక్షణ.. తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
- Jangaon: మద్యం మత్తులో హల్చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
తాజావార్తలు
-
Bhatti Vikramarka : బీఆర్ఎస్ మాయమాటలు నమ్మొద్దు..
-
O Sukumari: ముట్టుకుంటే షాక్ కొట్టే పెళ్లాం.. తిరువీర్ తిప్పలు చూస్తే నవ్వాపుకోలేరు!
-
China: ప్రపంచంలోనే తొలిసారి.. సముద్రంలోని వలలో రాకెట్‌ను దించిన చైనా!
-
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్‌లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
-
Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!