Ram Gopal Varma: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండ్రస్టీ మొత్తం విమర్శలతో ముంచెత్తుతుంది. ఒక మహిళా మినిస్టర్ అయి వుండి.. మరో మహిళపై ఇలా అసంబద్దమైన వాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ట్వీటర్ వేదికగా సినీ ఇండ్రస్టీ మొత్తం మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ట్విట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ కావాలని కోరారు. ఇలాంటివి జరగకుండా మంత్రి కొండా సురేఖకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నామని ఆయన అన్నారు. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయానని తెలిపారు. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదన్నారు.
Read also: CM Revanth Reddy: ఇవాళ్టి నుంచి కుటుంబ డిజిటల్ కార్డులు.. ప్రారంభించనున్న సీఎం
కేటీఆర్ ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటంలేదు ? అని ప్రశ్నించారు. తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం అన్నారు. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నామని ఆర్టీవీ ట్టిట్టర్ ద్వారా కోరారు.
Konda Surekha: కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదు.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు