తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన దూకుడును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఇంద్ర వెళ్లి, రావిలాల లో దళిత,గిరిజన ఆత్మ గౌరవ సభలు నిర్వహించగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో దళిత,గిరిజన గౌరవ ఆత్మ గౌరవ దీక్ష చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం లోపే ఈ దీక్షను ప్రారంభించనున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయితే… ఈ దీక్షను ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కొనసాగించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు దీక్షను విరమించనునున్నారు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ తో పాటు కాంగ్రెస్ దళిత, గిరిజన నేతలు దీక్షలో కూర్చోనున్నారు.