CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- సోషల్ మీడియా ప్రచారంపై ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్
- పార్టీ కోసం పనిచేయడంలో ఎవరికీ మినహాయింపు లేదన్న రేవంత్
- ప్రతి 10 రోజులకు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని మంత్రులకు ఆదేశం
- వలస ఓటర్ల ఓట్లు డిలీట్ కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు, మంత్రుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడే విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూనే, క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా సోషల్ మీడియా వారియర్లుగా మారి, ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ‘జమీందార్లు’గా తయారయ్యారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో కేవలం తమ వ్యక్తిగత ప్రచారం తప్ప.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను అస్సలు ప్రచారం చేయనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలనే అంశంపై ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన కార్యకర్తలను, క్యాడర్‌ను ప్రజాప్రతినిధులు విస్మరించకూడదని సీఎం హెచ్చరించారు. “పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కచ్చితంగా పనిచేయాల్సిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు… ఇలా ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. ఇందులో నాతో పాటు ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవు” అని రేవంత్ రెడ్డి కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఇకపై ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒక రోజును పూర్తిగా పార్టీ కార్యక్రమాల కోసమే కేటాయించాలని, నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను కలవాలని సీఎం ఆదేశించారు. కేవలం మంత్రులకే కాకుండా తనకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని చెబుతూ.. తాను కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తానని, నెలలో మూడు రోజులు కేవలం కార్యకర్తల కోసమే సమయం ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోయిన కాంగ్రెస్ అనుకూల ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా (డిలీట్ కాకుండా) చాలా జాగ్రత్త పడాలని పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!