BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్‌డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ (BMW) జర్మనీలోని తన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులలో దాదాపు సగం మందికి స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ చేయాలని నిర్ణయించింది. 2027 చివరి నాటికి దాదాపు 8,000 ఉద్యోగాలను తగ్గించుకునే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. జర్మనీలోని మొత్తం 85,000 మంది శాశ్వత ఉద్యోగులలో దాదాపు 40,000 మంది ఆఫీస్ లేదా డెస్క్ ఆధారిత ఉద్యోగులకు అక్టోబర్ నెల నుండి ఈ ఆఫర్లు అందించనున్నారు. అయితే ప్రొడక్షన్ లైన్ లేదా ప్లాంట్లలో నేరుగా పనిచేసే కార్మికులకు ఈ కోతల నుండి మినహాయింపు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా బిఎమ్‌డబ్ల్యూలో సుమారు 1.54 లక్షల మంది పనిచేస్తుండగా, ఈ తగ్గింపు ప్రణాళికపై పాలకమండలి, వర్క్స్ కౌన్సిల్ మధ్య దాదాపు ఆరు వారాల పాటు చర్చలు జరిగాయి.
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలపై తగ్గుతున్న లాభాలు, అమెరికా విధించిన సుంకాలు, ముఖ్యంగా చైనా నుండి వస్తున్న తీవ్రమైన పోటీ కారణంగా జర్మన్ కార్ల తయారీదారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను కుదించే మార్గాలను వెతుకుతున్నారు. ఇప్పటికే మరో ప్రముఖ సంస్థ వోక్స్వ్యాగన్ తన 10 బ్రాండ్ల పరిధిలో ఏకంగా లక్ష ఉద్యోగాల కోతపై ఆలోచిస్తుండగా, మెర్సిడెస్ బెంజ్ కూడా స్వచ్ఛంద విరమణ పథకాన్ని అమలు చేస్తోంది.
Also Read
- Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
- CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
- CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
- AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
ఇతర సంస్థలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్. ఎలక్ట్రిక్ వాహనాల రకాలను సమాంతరంగా కొనసాగిస్తూ బిఎమ్‌డబ్ల్యూ ఈ సంక్షోభాన్ని కొంతవరకు మెరుగ్గా తట్టుకోగలిగింది. అయినప్పటికీ, కంపెనీకి అత్యంత కీలకమైన చైనా మార్కెట్లో వ్యాపారం తీవ్రంగా మందగించింది. అక్కడ తీవ్ర పోటీ, ఆర్థిక మందగమనం కారణంగా వాహనాల డెలివరీలు భారీగా పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో చైనాలో బిఎమ్‌డబ్ల్యూ కార్ల విక్రయాలు 30 శాతం వరకు తగ్గాయి. దీంతో సంస్థ గత నెలలోనే ఊహించని విధంగా లాభాల హెచ్చరికను జారీ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వ్యయాలను నియంత్రించుకుని, వ్యాపారాన్ని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు బిఎమ్‌డబ్ల్యూ పెద్ద ఎత్తున లేఆఫ్‌లు, స్వచ్ఛంద విరమణలను అమలు చేయడానికి సిద్ధమైంది.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!