తెలంగాణ ఆవిర్భావం జూన్ 02 రోజున భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూ సమస్యలను లేకుండా చేసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భూ భారతి చట్టం చరిత్రాత్మకం అని అన్నారు. భూ సంస్కరణలు తెచ్చింది మొదట కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. Also…
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చింది. భూ సమస్యలు లేని తెలంగాణ కోస ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుల భూ సమస్యలు తీర్చాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి ఆర్వోఆర్ యాక్ట్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 02 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. నేటి నుంచి(జూన్ 03) ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ…
HYDRA : అమీన్‌పూర్ మున్సిపాలిటీలో సమగ్ర సర్వేకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఫిర్యాదులు అందడంతో.. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఆక్రమణలపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు హైడ్రా అధికారులు తమ కాలనీలోని పార్కులు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను పక్కనే ఉన్న గోల్డెన్ కీ వెంచర్స్ వాళ్లు ఆక్రమించారంటూ వెంకటరమణ కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 152, 153 లో ఉన్న వెంకటరమణ కాలనీలో హైడ్రా సర్వే చేపట్టింది.…
ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయల విలువైన భూముల్ని టీఆర్ఎస్ కొల్లగొడుతోందని, కేసీఆర్ చెప్పినట్టు ‘ధరణి’ సర్వరోగ నివారిణి కాదని అన్నారు. ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ అధ్యయనం చేసిందని, ముందే చెప్పినట్టు అందులో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భూకబ్జాకు పాల్పడుతోందని.. ప్రాజెక్టులు, ఫార్మాసిటీల పేరుతో భూ సమస్యల్ని సృష్టిస్తోందని ఆరోపించారు. భూముల్ని రైతులు కన్న బిడ్డల కంటే ప్రేమగా చూసుకుంటారని, అలాంటి…
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ ధరణి రచ్చబండ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూముల విలువ పెంపకం పేరుతో దందాలు జరుగుతున్నాయని చెప్పిన ఆమె.. దున్నేవాడికి కేసీఆర్ భూమి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం అడ్డగోలుగా భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎక్కడ భూములున్నా లాక్కుంటున్నారని విమర్శించారు. అటు.. ఫారెస్ట్ అధికారులు కూడా భూములు లాక్కుంటూ, పోడు రైతులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్…