CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
- ఆగస్టు 15లోపు పంపిణీ పూర్తి చేయాలని ఆదేశం
- నాణ్యతపై రాజీపడొద్దని అధికారులకు హెచ్చరిక
- విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తప్పనిసరి
- వచ్చే ఏడాదికి ముందస్తు ప్రణాళిక సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసే యూనిఫాంల పంపిణీ, నాణ్యతపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ (MCRHRD) బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు ఇచ్చే దుస్తుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పేద పిల్లల భవిష్యత్తు, సంక్షేమం కోసం పనిచేస్తున్నామనే భావనతో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, యూనిఫాంల పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమయానికి యూనిఫాంలను కుట్టి సరఫరా చేసేలా సంబంధిత ఏజెన్సీలు, సంస్థలపై ఒత్తిడి పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని విద్యార్థులందరికీ యూనిఫాంలు పూర్తిస్థాయిలో అందజేయాలని గడువు విధించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల పాఠశాల దుస్తుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారని విమర్శించిన సీఎం, ఇకపై అలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలన్నారు. అంతేకాకుండా, వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 2వ తేదీ) నాటికే విద్యార్థులందరికీ యూనిఫాంలు సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుంచే పక్కా కార్యాచరణ రూపొందించుకోవాలని స్పష్టం చేశారు.
Also Read
ఈసారి ప్రత్యేకంగా ప్రతి విద్యార్థి నుంచి యూనిఫాంల నాణ్యత, ఫిట్టింగ్‌పై అభిప్రాయ సేకరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే వచ్చే ఏడాది పంపిణీకి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులుతో పాటు విద్యాశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
-
Temple Tourism: అమరావతికి సరికొత్త కాంతి.. తిరుమల తర్వాత ఆ స్థాయిలో అక్కడ శ్రీవారి క్షేత్రం..
-
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తాం
-
Dada : ‘దాదా’గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
-
Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!