Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: ప్రేమ పేరుతో ప్రియుడు చేసిన మానసిక, శారీరక వేధింపులు భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్‌లోని ఇందిరానగర్‌కు చెందిన గండమళ్ల చందన (23) మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారానికి చెందిన తుడుము శివ అనే యువకుడితో ఆమె గత ఏడాదిన్నర కాలంగా ప్రేమలో ఉంది. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ మనస్పర్థలు, తీవ్ర వివాదాలు జరుగుతున్నాయి.
శివ వేధింపులు.. కుటుంబసభ్యులు హెచ్చరించినా మారని వైనం ప్రేమ వ్యవహారంలో విభేదాలు రావడంతో శివ చందనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసేవాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. శివ తీరుతో విసిగిపోయిన బాధిత కుటుంబం అతడిని పలుమార్లు హెచ్చరించినప్పటికీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. శివ వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో తట్టుకోలేకపోతున్నానని, చనిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయని చందన గతంలోనే తన అక్క వద్ద వాపోయి కన్నీరు పెట్టుకుంది.
Also Read
- Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
- RGIA: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత.. ఇద్దరిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ..
- Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
- Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన చందన.. అక్టోబర్ 22న తన నివాసంలో ఫ్యానుకు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తన కుమార్తె ప్రాణాలు కోల్పోవడానికి తుడుము శివ వేధింపులే కారణమని మృతురాలి తల్లి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
-
Himanshu Bhau: అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాంశు భౌ అరెస్ట్.. భారత్‌కు తరలింపు!
-
Indian Curries in TasteAtlas Top 50: ప్రపంచంలోనే టాప్ 50 టేస్టీ కూరల్లో 8 భారత్‌వే.. సత్తా చాటిన ఇండియన్ వంటకాలు
-
అక్రమ బాణాసంచా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!
-
Alluri District Blast: మైనింగ్ ప్రాంతంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!