Minister Lokesh: వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్ మార్పుకు శ్రీకారం చుట్టింది. కొత్త యూనిఫామ్లకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆమోదం తెలిపారు. ఏ రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా ఈ యూనిఫాం రూపొందించాలన్నారు.
నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బాలబాలికలు అందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించి ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.