కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తొమ్మిది ప్రశ్నలతో కూడిన లేఖను అమిత్ షా కు వ్రాశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటని ప్రశ్నించారు. పంట కొనుగోలు చేయకుండా ఆడిన రాజకీయ డ్రామాలో.. ధాన్యం రైతుల మరణాలకు బాధితులు ఎవరు అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడిన… మోడీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు అంటూ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాత చెందిన భద్రాద్రి రాముడికి.. రామాయణం సర్క్యూట్ లో చోటు ఎక్కడ ఉందో వివరించాలన్నారు. అయోధ్య రాముడు.. భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒకటి కాదా ? అని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
కాగా.. కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే.. తెలంగాణకు బీజేపీ చేస్తున్న అన్యాయాలపైన ప్రశ్నలు సంధించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉంటే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. తెలంగాణపై బీజేపీ పార్టీది అదే కక్ష అని… ఎనిమిదేళ్లు గడిచినా అదే వివక్ష. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని ఫైర్ అయ్యారు.
ప్రతిసారి వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. మళ్లీ పత్తా లేకుండా పోవుడు. ఇదే బిజెపి కేంద్ర నాయకులకు అలవాటుగా మాదిందని… ఇంకెంతకాలం తెలంగాణపై ఈ నిర్లక్ష్య ధోరణి అని ఓ రేంజ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకుని వస్తావని అమిత్ షాను ప్రశ్నించారు కేటీఆర్.
అయితే.. కేంద్ర మంత్రి అమిత్ షాపై ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ ప్రశ్నించారు. బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ రూ. 1350 కోట్లు, GST పరిహారం రూ. 2247 కోట్ల సంగతేంటి? అని ఆమె ప్రశ్నించారు. బీజేపీ హయాంలో విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై మీ సమాధానం ఏమిటి? అని ట్విటర్ వేదికగా అమిత్ షా పై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలతో ముంచెత్తారు.
భారత్‌ను అత్యంత ఖరీదైన ఇంధనం మరియు LPGని విక్రయించడంలో అగ్రగామి దేశంగా మార్చడంపై మీ సమాధానం ఏమిటి? అన్నారు. అమిత్ షా జీ, ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించండి అంటూ ఎద్దేవా చేశారు.
మిషన్ కాకతీయ మరియు మిషన్ భగీరథకు ₹ 24,000 కోట్ల నిధులు ఇవ్వాలని, NITI అయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పండి అంటూ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అమిత్ షా జీ, కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు, జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరియు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా? అంటూ అమిత్ షాకు ట్విటర్ ద్వారా కవిత ప్రశ్నించారు.
అమిత్ షా గారూ…
‘ఛీ’ఆర్ఎస్ తో సావాసం…
తెలంగాణ ప్రజలకు ఇద్దరూ కలిసి చేసిన మోసంతో పాటు…
తెలంగాణ ఆత్మగౌరవం పై మోదీ దాడి, రైతుకు అన్యాయం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు… వీటిపై నా తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పండి. pic.twitter.com/lnMaDrkNnx— Revanth Reddy (@revanth_anumula) May 14, 2022