Revanth Reddy: పసుపు బోర్డు తెస్తానని పత్తా లేకుండా పోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండు పేపర్ రాసి ఇచ్చి పత్తా లేకుండా పోయారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చేరుకుంది. ఉదయం బెంగాల్ లింబాద్రి నర్సింహస్వామిని దర్శించుకున్న అనంతరం కమ్మర్ పల్లిలో రైతులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత రైతులను అదుకోలేదన్నారు. బోర్డు తెస్తానని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. పసుపు, ఎర్రజొన్న, చెరుకు పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. తెలంగాణలో కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చారు కానీ యువతకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదని తెలిపారు.
Read also: Top Headlines @1PM: టాప్ న్యూస్
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
కల్వకుంట్ల కుటుంబానికి వేలకోట్ల ఆస్తుల వచ్చాయి, ఫామ్ హౌస్ భూములు వచ్చాయని ఆరోపించారు. ఆదాని, అంబానీ లకు దేశ సొత్తును మోడీ దోచి పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా, పంజాబ్ రైతుల స్పూర్తి నిజామాబాద్ రైతులకు పోరాటం చేసె సత్తా ఉందని అన్నారు. పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండు పేపర్ రాసి ఇచ్చి పత్తా లేకుండా పోయిండని అన్నారు. 100 రోజుల్లో చెరుకు పరిశ్రమ తెరుస్తానని చెప్పి మాట తప్పారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత రైతులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఆదుకోవడం లేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు అండగా నిలవాలన్నారు. 60 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చూసి పార్టీ నష్టపోయిన తెలంగాణ ను కాంగ్రెస్ ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
Read also: KTR Counter: పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? కిషన్‌రెడ్డికి కేటీఆర్ కౌంటర్..
ఇవాళ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన రేవంత్ కమ్మర్ పల్లిలో రైతులతో సమావేశమయ్యారు. నిజామాబాద్ నియోజకవర్గంలోనే 13 నుంచి 17 వరకు పాదయాత్ర కొనసాగనుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. కాగా.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నేటి స్ట్రాంగ్ క్యాడర్ ఉండటంతో..తిరిగి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా తన యాత్ర షేడ్యూల్ ను రూపొందించారు. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
AP Politics: పవన్ భావజాలంలోనే ‘బీసీ’లు లేరు.. మంత్రి జోగి రమేష్ ఛాలెంజ్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!