Harish Rao : సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
- సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు ఘాటు కౌంటర్
- తెలంగాణ జలాలపై ప్రభుత్వాన్ని నిలదీత
- హామీలు అమలు చేయాలని కాంగ్రెస్‌కు సూచన
- అసెంబ్లీ రద్దు చేసి ప్రజల్లోకి రావాలని సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా నన్ను తిట్టనిదే ఆయనకు తెల్లారదు. నిద్రలో కూడా ఆయన బీఆర్ఎస్ (BRS) పార్టీనే కలవరిస్తున్నారంటేనే ఆయనకు ఎంత భయం పట్టుకుందో అర్థమవుతోంది” అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు ఎద్దేవా చేశారు. శారీరక ఎత్తుపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
నీ ఆలోచనలే పొట్టి.. మా పనితీరులో మేం పొడుగు
“ఏమన్నా అంటే అరడుగులు ఉన్నావ్ అంటూ నా ఎత్తు గురించి, జగదీష్ రెడ్డి పొట్టిగా ఉన్నారంటూ సీఎం మాట్లాడుతున్నారు. మాకు ఆయనలాగా సంకుచిత మనసు, కుంచిత మనస్తత్వం లేవు. మా పనితీరులో మేం ఎప్పుడూ పొడుగే. కానీ సీఎం రేవంత్ రెడ్డి నీ మనసు పొట్టి, నీ ఆలోచనలు పొట్టి, నిజానికి నువ్వే పొట్టిగా ఉన్నావు” అని హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. అధికార మదం, అహంకారంతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు త్వరలోనే ఉప్పు పాతర వేయడం ఖాయమని హెచ్చరించారు. ప్రతిపక్షాలను తిట్టడం పక్కనబెట్టి, ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై సీఎం దృష్టి పెట్టాలని హితవు పలికారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తెలంగాణను ఆగం చేయకు.. నువ్వు ముంపు మేస్త్రివి కావొద్దు
ఇటీవల ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కర్ణాటకలో పెట్టిన మీటింగ్ వెనుక ఉన్న మతలబు ఏంటో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. “కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు ఉన్న హక్కులను నువ్వు కాపాడావా? నీకు అన్ని విషయాలు సగం సగమే తెలుసు. అధికారం మొత్తాన్ని కేంద్ర మంత్రి చేతిలో పెట్టేసి తెలంగాణను ఆగం చేయవద్దని నేను ముందే చెప్పాను. నువ్వు గుంపు మేస్త్రివో కాదో నాకు తెలియదు కానీ.. ఈ రాష్ట్రాన్ని ముంచేసే ‘ముంపు మేస్త్రి’ మాత్రం కావొద్దు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి.. ప్రజల్లో తేల్చుకుందాం!
రాబోయే 2028 నుండి 2034 వరకు తామే అధికారంలో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుకోవడాన్ని హరీష్ రావు తప్పుపట్టారు. “నీకు అంత దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి పోదాం రా.. ఎవరు అధికారంలోకి వస్తారో ప్రజలే తేలుస్తారు” అని సవాల్ విసిరారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామాలు చేయించాలని, అప్పుడు మీ బలమేంటో, మా బలమేంటో ఉప ఎన్నికల బరిలో చూసుకుందామని హరీష్ రావు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!