CM Revanth Reddy : భూసేకరణ లెక్కలతో కేసీఆర్‌పై రేవంత్ ఫైర్.. పాలమూరు–రంగారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
- కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర విమర్శలు
- భూసేకరణ ఖర్చులపై కీలక లెక్కలు
- పాలమూరు అంచనాల పెంపుపై ప్రశ్నలు
- ముంపు బాధితుల పరిహారంపై నిలదీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జలాలు, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల భూసేకరణకు కేవలం రూ.3,315 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 34 నెలల్లోనే రూ.3,518 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ముందుగా భూసేకరణ జరగాలని, రైతులకు పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. భూసేకరణ చేయకుండానే పంపులు, లిఫ్టుల పేరుతో వేల కోట్లు ఖర్చు చేశారని, టెండర్లు, కాంట్రాక్టుల సాకుతో నిధుల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.
భూసేకరణ లెక్కలు.. ప్రత్యేక అధికారుల నియామకం
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 14,519 ఎకరాల భూసేకరణ పూర్తి చేశామని రేవంత్ రెడ్డి లెక్కలు బయటపెట్టారు. కేసీఆర్ హయాంలో భూసేకరణకు ఏటా సగటున రూ.345 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వంలో ఏటా రూ.1,256 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనుల కోసం ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించామని, ప్రతి కలెక్టర్ పరిధిలోనూ భూసేకరణకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశామని చెప్పారు. వీటి ద్వారా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
Also Read
- Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
- BM Sandeep : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త వ్యూహం.. రెండేళ్ల టార్గెట్ ఫిక్స్
- NIMS : నిమ్స్‌లో ఏసీబీ షాకింగ్ తనిఖీలు.. చనిపోయిన రోగుల పేరుతోనూ బిల్లులు!
- CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
పాలమూరు–రంగారెడ్డి అంచనాలు రూ.80 వేల కోట్లకు పెంచారు
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.35 వేల కోట్ల స్థాయి నుంచి దాదాపు రూ.80 వేల కోట్లకు పెంచేశారని విమర్శించారు. ప్రాజెక్టుల ప్రాంతాలు, పేర్లు, అంచనాలు మార్చడంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారని, పంపుల సంఖ్య పెంచారే తప్ప ప్రాజెక్టు పూర్తి చేయలేదని అన్నారు. పాలమూరు–రంగారెడ్డిని పూర్తిచేశామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, మరి నీళ్లు ఎందుకు ఎత్తలేదని నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 34 నెలల్లో పాలమూరు–రంగారెడ్డికి రూ.6,765 కోట్లు ఇచ్చామని, అందులో భూసేకరణ కోసమే రూ.3,518 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
ముంపు బాధితులపై నిర్లక్ష్యం.. పెండింగ్‌లో కృష్ణా ప్రాజెక్టులు
ముంపు గ్రామాల ప్రజల గురించి, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి ఏనాడూ లేదని సీఎం మండిపడ్డారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ముంపు గ్రామాలను ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 4,250 ఎకరాల భూసేకరణ చేశామని, భూసేకరణ పూర్తి చేస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే అనేక పనులు పూర్తయ్యేవని, కానీ ఎస్ఎల్బీసీ, డిండి, అచ్చంపేట, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పనులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
-
Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy : భూసేకరణ లెక్కలతో కేసీఆర్‌పై రేవంత్ ఫైర్.. పాలమూరు–రంగారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!