NTV Telugu Site icon

MLA K.V Ramana Reddy: అక్బరుద్దీన్ ఓవైసీని చూసి గజగజలాడుతున్నారు.. ఎందుకు..?

Kvr

Kvr

MLA K.V Ramana Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రతి పక్షంలో కూర్చో పెట్టారు.. రేవంత్ సర్కార్ ఏమీ చేస్తామో చెప్పకుండా గత ప్రభుత్వాన్నీ విమర్శించడం పనిగా పెట్టుకుంది.. విధ్వంసం, అప్పుల పాలు అయిన తెలంగాణలో 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఎలా జరుగుతుంది.. లక్ష 50 వేల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన ఎలా అవుతుంది.. అక్బరుద్దీన్ ఓవైసీకి రూ. 300 కోట్లు ఎలా ఇస్తామని అన్నారు అంటూ ప్రశ్నించారు. ఇక, కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదో చెప్పమని అడిగితే చెప్పరు.. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే సినిమా చూసినట్టు చూస్తారు.. బీజేపీకి టైమ్ ఇవ్వమంటే ఇవ్వరు.. అసెంబ్లీలో బూతు పురాణం మాట్లాడుతున్నారు.. అప్పుడే అప్పులు అంటాడు.. అప్పుడే శంకుస్థాపనలు చేస్తున్నామని రేవంత్ రెడ్డీ అంటున్నారు.. రిటైర్ అధికారులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు.. వారి తర్వాత ఉన్న ఉద్యోగులు అసమర్థుల అని ఎమ్మెల్యే కే.వీ రమణ రెడ్డి అన్నారు.

Read Also: Delhi bomb threat: ఢిల్లీ స్కూల్‌కి బాంబు బెదిరింపులో ఊహించని ట్విస్ట్

ఇక, మంత్రుల పేషీలో 20 మంది ఉన్నారు.. తమ వాళ్ళను పెట్టుకుంటున్నారు.. దీని వల్ల ప్రజాధనం వృథా అవుతుంది అని వెంకట రమణ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కో ఐఏఎస్ కు 8 డిపార్ట్ మెంట్ లు ఇస్తున్నారు.. ఐఏఎస్ లు బదిలీ అయితే అయనతో పని చేసిన వారిని తీసుకు పోతున్నారు.. ఆంధ్ర కేడర్ కు చెందిన అధికారులను అడ్వైజర్లుగా ముఖ్యమంత్రి పెట్టుకున్నారు.. తెలంగాణ పేరు చెపుకొని బతకడమే తప్ప చేసేదేమీ లేదు అని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీలో వచ్చే డబ్బులు జీహెచ్ఎంసీ పరిధిలోనే పెట్టాలి అని డిమాండ్ చేశారు. కొడంగల్, మధిరకు ఎందుకు పోతుంది అని కాటేపల్లి వెంకట రమణ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: Ismail Haniyeh : హనియే హత్యకు కుట్ర పన్నింది ఇరాన్‌లోనే.. ఇంటెలిజెన్స్ అధికారి సహా 24 మంది అరెస్ట్

కాగా, బీఆర్ఎస్ Bనేతలు ధర్నాలు చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకొని ఉండరు అని బీజేపీ ఎమ్మెల్యే కే.వీ రమణ రెడ్డి అన్నారు. వాళ్లు( BRS ) ఎగెరిగిరి పడితే వారి పరిస్థితి ఏందో అర్థం కావడం లేదా మీకు.. నిజాం అకృత్యాలు మీకు గుర్తుకు రావడం లేదా రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. అక్బరుద్దీన్ ఓవైసీని చూస్తే గజగజలాడుతున్నవ్.. నయా నిజాం లెక్క మాట్లాడుతున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు, ఒళ్ళు ఉందని ఇష్టమొచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడిన వారిని ఐదు సంవత్సరాలు పోటీ చేయకుండా సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో 500 కోట్ల రూపాయల యాడ్ స్కాం జరిగింది అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణ రెడ్డి ఆరోపించారు.