NTV Telugu Site icon

Revanth Reddy: కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే ఆరెండు పార్టీలు కుట్ర

Revanth Reddy Kodangal

Revanth Reddy Kodangal

Revanth Reddy: కాంగ్రేస్ ను దెబ్బతీసేందుకే టీఆరెస్, బీజేపీ ల కుట్ర చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్టీవీతో చిట్ చాట్‌ చేసిన ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించిందని అన్నారు. కానీ టీఆరెస్, బీజేపీ నేతలు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయడంలేదు? అంటూ రేవంత్‌ మండిపడ్డారు. కాంగ్రేస్ ను దెబ్బతీసేందుకే టీఆర్‌ఎస్‌, బీజేపీల కుట్రఅని నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ పాలనలో కొడంగల్ కు తుప్పు పట్టిందని ఆరోపించారు. డ్రామారావు దత్తత తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: MLC Kavitha Letter to CBI: సీబీఐకి ఎమ్మెల్యే కవిత మరో లేఖ.. ఎఫ్‌ఐఆర్‌లో నా పేరు లేదు.. 6న కలవలేను..!

పాలమూరు రంగారెడ్డి తప్ప టీఆర్‌ఎస్‌కు ఏ ప్రాజెక్టుతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అవన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే అంటూ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇప్పటివరకు ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్నించారు. 2019 జనవరి 1 నుంచి కొడంగల్ కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉన్నారని, నాలుగేళ్ళ కాలంలో ఏం అభివృద్ధి చేశారో కేటీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కొడంగల్ అభివృద్ధికి నిధులు వచ్చే వరకు ఎమ్మెల్యే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని పిలుపు నిచ్చారు. కొడంగల్ కు అభివృద్ధికి నిధులు వచ్చుడో శాసన సభ్యుడు సచ్చుడో తేలాలని ఆయన వ్యాక్యానించారు. అసెంబ్లీలో కొడంగల్ అభివృద్ధిపై నిర్దిష్టమైన ప్రకటన జరగాలని అన్నారు. లేకపోతే గ్రామ గ్రామాన తిరిగి… టీఆర్‌ఎస్‌ తీరును ఉతికి ఆరేస్తామని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.
Fake Baba Case: అమ్మాయిల ఫిజిక్ ని బట్టి రేటు.. వ్యభిచార ముఠాకు నగ్న ఫోటోలు