సినిమా రిలీజ్ టైం దగ్గర పడింది. రిలీజ్‌కు ఇంకా వారం రోజులు కూడా లేదు. అయినా కూడా ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు మేకర్స్. అసలు ప్రభాస్ ప్రమోషన్స్‌కు వస్తాడా? రాడా? అనేది డౌట్‌గానే ఉంది. ప్రమోషనల్ కంటెంట్ కూడా పెద్దగా బయటికి రావడం లేదు. దీంతో ఇంకెప్పుడు ప్రమోట్ చేస్తారు? అని ఎదురు చూస్తునే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే.. ఎట్టకేలకు ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే సండే నాడు మీడియా ముందుకు రాబోతున్నాడట ప్రశాంత్ నీల్. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కన్ఫామ్ చేశాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే ప్రశాంత్ నీల్‌తో పాటు ప్రభాస్ కూడా మీడియా ముందుకు వస్తున్నాడా? అనే విషయంలో క్లారిటీ లేదు. కనీసం సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ లేకుండా ప్రశాంత్ నీల్ ఒక్కడే పాన్ ఇండియా ప్రమోషన్స్ ని చేయగలడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి సలార్ ప్రమోషన్స్ విషయంలో… ప్రభాస్ ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే ఇచ్చాడు. అది కూడా రాజమౌళితో చేసిన స్పెషల్ ఇంటర్య్యూ.
రేపో మాపో ఈ ఇంటర్య్వూ బయటికి రానుందని అంటున్నారు. ఇందులో ప్రభాస్, ప్రశాంత్ నీల్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్‌ను రాజమౌళి ఇంటర్య్వూ చేసాడు. ఈ ఇంటర్వ్యూ మినహా ప్రభాస్ సలార్ ప్రమోషన్స్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే చాలా చోట్ల సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా టికెట్స్ బుకింగ్స్ చేసే పనిలో ఉన్నారు. డిసెంబర్ 22న సలార్ వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కెజియఫ్‌తో గూస్ బంప్స్ తెప్పించిన రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా… ప్రభాస్ ఫ్రెండ్‌గా మళయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. మరి సలార్ ఎలా ఉంటుందో చూడాలి.