జనసేన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు.. పాల్గొన్న పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు అర్హమ్ ఖాన్, మహేందర్‌రెడ్డి, శంకర్ గౌడ్, ఏవీ రత్నం, షేక్ రియాజ్, కళ్యాణం శివ శ్రీనివాస్, రాజలింగం, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. స్వేచ్ఛాయుత భారతంలో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలని ఆకాంక్షించారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలను హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. #RepublicDay #RepublicDayIndia pic.twitter.com/0QauQZWf1h
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
— JanaSena Party (@JanaSenaParty) January 26, 2022
Read Also: పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
అంతకుముందు రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డు విజేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు విస్తృత ప్రయోగాలు చేసి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన భారత్ బయోటెక్ సంస్థ కృషిని అభినందిస్తూ ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎల్లా కృష్ణ, సుచిత ఎల్లాలకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం హర్షణీయమన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో తెలుగు వారి ఖ్యాతిని దాటించిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, కోవిడ్ వ్యాక్సిన్ అందించిన సీరం సంస్థ ఛైర్మన్ సైరస్ పూనావాలాలను పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం సముచితమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!