Kishtwar SPO Killings: ‘‘మసీదు నుంచి బెదిరింపులు, ఇద్దరు పోలీసుల హత్య’’ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..
- కిష్త్వార్ పోలీసుల హత్యల విషయంలో బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..
- స్థానిక మసీదు నుంచి బెదిరింపులు వచ్చినట్లు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishtwar SPO Killings: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు (SPO) హత్యకు గురైన ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ జంట హత్యల వెనక స్థానికంగా కుట్ర జరిగి ఉండొచ్చని బీజేపీ ఎమ్మెల్యే షుగన్ పరిహార్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఆ ఇద్దరు ఎస్పీఓలకు ఒక మసీదు నుంచి బెదిరింపులు వచ్చాయని ఆమె ఆరోపించారు. ఈ బెదిరింపులపై అప్పట్లో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. భద్రతా లోపాలు, సీనియర్ పోలీస్ అధికారుల పాత్ర గురించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
హత్యకు గురైన ఇద్దరు పోలీస్ అధికారుల గ్రామమైన కియార్ను షుగన్ పరిహార్ సందర్శించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సునీల్ శర్మ కూడా ఆమెతో వెళ్లారు. ఇద్దరు పోలీసుల అంత్యక్రియల సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరికి గతంలో మసీదు నుంచి బెదిరింపులు వచ్చాయని, ఈ ప్రాంతంలో ఎవరైనా ఉగ్రవాదులకు సమాచారం అందిస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు జరపాలని అన్నారు.
Also Read
- Sam Pitroda: ‘‘ప్రధాని మోడీ ఫోన్లు ట్యాప్ చేయరు’’.. రాహుల్‌కు భిన్నంగా సామ్ పిట్రోడా కామెంట్స్.!
- Delhi Police: రామ్‌లీలా మైదానంలో సభలకు కొత్త రూల్స్.. ఢిల్లీ పోలీస్ షాకింగ్ నిర్ణయం!
- Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!
- Supriya Sule: ఎన్సీపీ విలీనంపై సస్పెన్స్‌కు తెర.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన సుప్రియా సూలే!
జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)లో విధులు నిర్వర్తిస్తున్న 57 ఏల్ల బాబీ చంద్, 45 ఏళ్ల రష్పాల్ కుమార్ నవంబర్ 11న తమ శిబిరం నుంచి పోలీస్ పోస్టకు వెళ్లారు. విధుల్లో భాగంగా ధర్నా-మార్వా ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా, మార్గం మధ్యలో అదృశ్యమయ్యారు. నవంబర్ 12న అటవీ ప్రాంతంలో తీవ్రమైన బుల్లెట్ గాయాలతో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి వద్ద ఉన్న ఇన్సాన్, 303 రైఫిల్ కనిపించకుండాపోయాయి. ఘటనా స్థంలో పాకిస్తాన్ లో తయారైన బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్‌ను ఛేదించే తూటాలు లభ్యమయ్యాయి. ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. ముగ్గురు ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి రూ. 30 లక్షల నజరానా ప్రకటించారు.
తాజావార్తలు
-
Kishtwar SPO Killings: ‘‘మసీదు నుంచి బెదిరింపులు, ఇద్దరు పోలీసుల హత్య’’ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..
-
Ukraine Peace Deal: డాన్బాస్ కావాలా.. NATO సభ్యత్వమా? ఉక్రెయిన్ ముందు అమెరికా ప్రతిపాదన!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవానికి మోడీ శుభాకాంక్షలు.. 2023 జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ప్రధాని
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
-
Garuda Purana: గరుడ పురాణం అంటే కేవలం చావు గురించేనా?.. అదొక అద్భుతమైన జీవిత పాఠశాల
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!