Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ, నొప్పి తనకు తెలుసని లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లో గిగ్ వర్కర్ల ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. మీరు ఎలా ఉన్నారంటూ గిగ్ వర్కర్లను కాంగ్రెస్ అగ్రనేత పలకరించారు. గిగ్ వర్కర్ల కష్టం గుర్తించే తాను, తమ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తామని నాడు హామీ ఇచ్చాం, వాగ్దానం చేశామన్నారు. తాము ఆ వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్పుకొచ్చారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన డేటా ఇప్పటి వరకు భారతదేశంలో లేదన్నారు. డెలివరీకి సంబంధించి ఎంత సమయం పడుతుంది.. ఎంత ఇస్తారనే సమాచారం కూడ లేదని.. కష్టం మీది కానీ మీ సమాచారం మీ దగ్గర లేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మీ కోసం పని చేస్తోందని.. ప్రతి డెలివరీపై మీకు వచ్చే దానిని మీకు తెలియజేస్తోందని వివరించారు. తెలంగాణలో నగరాల్లోని ఎండల్లో మీరు మోటార్ సైకిళ్లపై వెళుతుంటారని. మీకు విశ్రాంతి కోసం ఎటువంటి రెస్ట్ హౌజ్‌లు లేవని.. ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేందుకు హైదరాబాద్‌లో, తెలంగాణలోని ఇతర నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వం రెస్ట్ హౌజ్‌లు నిర్మించిందన్నారు.
గిగ్ వర్కర్లకు అనారోగ్యం వచ్చినప్పుడు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ. పది లక్షల ప్రమాద బీమాను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారు. “గిగ్ వర్కర్లకు పింఛను, ఇతర సౌకర్యాలు అందుతాయి.. ప్రతి డెలివరి, ప్రతి రవాణాకు సంబంధించిన 1 శాతం మీ గిగ్ వర్కర్ల ఖాతాలో చేరుతుంది. ఆ డబ్బు గిగ్ వర్కర్ల బోర్డుకు చేరుతుంది. అక్కడి నుంచి మీ ఖాతాకు చేరుతుంది. దేశంలో రెండు ఆలోచన విధానాలు ఉన్నాయి.. మొదటిది ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానం.. అది కట్టు బానిసత్వాన్ని కోరుతుంది.. 24 గంటలు పని చేయాలి. శ్రమను దోచుకునేవి.. మీ శ్రమను అదానీకి, అంబానీకి దోచిపెట్టేవి. రెండవది గిగ్ వర్కర్.. దేశానికి పునాది, దేశ భాగస్వామి అని కాంగ్రెస్ ఆలోచన విధానం. గిగ్ వర్కర్‌కు రక్షణ కల్పించాలనేది కాంగ్రెస్ ఆలోచన.. మీకు ప్రతి డెలివరిలో వాటా రావాలని, మీకు రెస్ట్ దొరకాలని కాంగ్రెస్ భావిస్తోంది.. నరేంద్ర మోడీ ఆలోచన విధానం.. మీకు ఏం దక్కవద్దంటోంది.. రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలకు చదువు, మీ ఆరోగ్యానికి అండగా ఉంటుంది.. మీరు భయపడవద్దు.. మీకు మేం అండగా ఉంటాం..” అని భరోసా ఇచ్చారు. జై హింద్.. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
Also Read
- CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
- Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
- Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
- Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
తాజావార్తలు
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
-
Vintara Saradaga Release Date: నూతన సంవత్సర కానుకగా గౌరీ ప్రియ ‘వింటారా సరదాగా’!
-
CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
-
Trump Asia Tour: చైనాలో ఒకే వేదికపై ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్.. తొలిసారి చరిత్రాత్మక భేటీ!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!