Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Homemade Rava: వంటింట్లో ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో వాడే బొంబాయి రవ్వ తెలియని వాళ్లు ఉండరు. ఉదయం టిఫిన్‌లో వేడివేడి ఉప్మా, ఇడ్లీల దగ్గర నుంచి పండగ పూట చేసే తీపి హల్వా మొదలైన స్వీట్ల వరకు దీని అవసరం ఎక్కడో ఒక చోట ఉంటుంది. అయితే, మనం సూపర్ మార్కెట్ల నుంచి తెచ్చుకునే ప్యాకెట్ రవ్వ నిజంగా స్వచ్ఛమైనదేనా? నెలల తరబడి గోడౌన్లలో నిల్వ ఉండటం వల్ల అందులో పురుగులు, నుసి పట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, కొందరు వ్యాపారులు లాభాల కోసం రవ్వలో మైదా పిండి కలిపి కల్తీ చేసే ప్రమాదమూ పొంచి ఉంది. రసాయనాలు, పాలిష్, కల్తీ ఏవీ లేని 100 శాతం స్వచ్ఛమైన రవ్వను మీ కుటుంబానికి అందించాలంటే ఇకపై షాపులపై ఆధారపడాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే సాధారణ గోధుమలతోనే అత్యంత సులభంగా, అచ్చం బయట కొన్నట్లుండే పూసపూసలాంటి రవ్వను తయారు చేసుకోవచ్చు. దీనివల్ల గోధుమల్లోని సహజ పోషకాలు, ఫైబర్ ఏమాత్రం తగ్గకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంతకీ దీనిని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కల్తీ లేని రవ్వ తయారీకి కావాల్సినవి..
* మంచి నాణ్యత గల గోధుమలు: 1 కిలో
Also Read
- Chanakya Niti: చెడ్డ కొడుకు కుటుంబానికి శాపం.. మంచి కొడుకు వంశానికి దీపం!
- Children's Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
- Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
- Best Wood for Furniture: ఇంటి ఫర్నీచర్‌కు ఏ కలప బెస్ట్? టేకు నుంచి శీశం వరకు.. చెదలు పట్టకుండా ఏం చేయాలి?
* మిక్సీ గ్రైండర్
* సన్నని పిండి జల్లెడ (మధ్యస్థ రంధ్రాలు ఉండే రవ్వ జల్లెడ)
*రవ్వ పూసపూసలా రావడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సీక్రెట్ చిట్కాలు:
* గోధుమలకు తడి తగిలించే ట్రిక్: గోధుమలను మిక్సీ పట్టడానికి సరిగ్గా 10 నిమిషాల ముందు వాటిపై కొద్దిగా నీళ్లు చిలకరించి బాగా కలపాలి. ఈ చిన్న చిట్కా వల్ల గోధుమల పైపొర (ఊక) సులభంగా వేరై, లోపలి గింజ చక్కగా రవ్వలా విరుగుతుంది.
* పురుగు పట్టకుండా డ్రై రోస్ట్: రవ్వ తయారైన వెంటనే నెయ్యి వేయకుండా మందపాటి కడాయిలో సన్నని మంటపై 2-3 నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల రవ్వలోని తేమ పూర్తిగా ఆవిరైపోయి, నెలల తరబడి నిల్వ ఉన్నా పురుగు లేదా ముక్కు పట్టకుండా తాజాగా ఉంటుంది.
*ఇంట్లోనే రవ్వ తయారు చేసుకునే సులభమైన విధానం ఇదే..
ముందుగా గోధుమల్లో రాళ్లు, మట్టి లేకుండా ఏరివేసి, నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత వీటిని ఎండలో 4 నుంచి 5 గంటల పాటు బాగా ఆరబెట్టాలి. గోధుమలు కరకరలాడుతూ పూర్తిగా ఎండిపోవాలి. తర్వాత బాగా ఎండిన గోధుమలను మిక్సీ జార్లో వేయాలి. మిక్సీని ఒకేసారి వేగంగా తిప్పకుండా, ‘పల్స్ మోడ్’లో (ఆపుతూ, తిప్పుతూ) 2-3 సార్లు గ్రైండ్ చేయాలి. ఇలా చేస్తే గోధుమలు మెత్తటి పిండిలా కాకుండా, చక్కగా బరకగా రవ్వలా విరుగుతాయి.
ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ముందుగా సన్నని పిండి జల్లెడలో వేసి జల్లించాలి. దీనివల్ల అందులో తయారైన మెత్తటి గోధుమపిండి కిందకు వచ్చేస్తుంది (దీనిని చపాతీలకు వాడుకోవచ్చు). జల్లెడలో మిగిలిన బరక మిశ్రమాన్ని ఇప్పుడు రవ్వ జల్లెడలో వేసి జల్లించాలి. కింద గిన్నెలో స్వచ్ఛమైన, కల్తీ లేని బొంబాయి రవ్వ రెడీ అవుతుంది. రవ్వ జల్లెడలో జల్లించిన తర్వాత పైన మిగిలిపోయిన లావుపాటి గోధుమ ముక్కలను వృథాగా పారేయాల్సిన పనిలేదు. వాటిని మనం బయట కొనే లావు గోధుమ రవ్వ లాగా ఉప్మా లేదా కిచిడీ చేసుకోవడానికి చక్కగా వాడుకోవచ్చు. ఇలా రెడీ అయిన రవ్వను సన్నని మంటపై 2-3 నిమిషాలు దోరగా వేయించి, పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం తడి లేని, గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. బయట దొరికే కల్తీ రవ్వ భయం లేకుండా, ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న తాజా రవ్వతో ఉప్మా లేదా హల్వా చేసి చూడండి.. దాని కమ్మని వాసన, రుచి మీ కుటుంబానికి తప్పకుండా నచ్చుతుంది.
తాజావార్తలు
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
-
Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
-
NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
-
AP Assembly: పేపర్‌లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్‌లకు ‘నేషనల్ ఈ-విధాన్’ (NeVA) శిక్షణ..
-
Singur Project: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.. రెండు గేట్లు ఎత్తిన అధికారులు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!