తెలంగాణలో త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండడంతో వ్యాపారులు, వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నల్గొండ జిల్లాలో కిక్కిరిసి పోయాయి రిజిస్ట్రేషన్ల ఆఫీసులు. గంటల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించకతప్పడం లేదు. మరో రెండురోజుల తర్వాత ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే స్లాట్ లు బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సాధారణ వినియోగదారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థలాలు కొనుగోలుచేయడం భారంగా మారుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.