తెలంగాణలో త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండడంతో వ్యాపారులు, వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నల్గొండ జిల్లాలో కిక్కిరిసి పోయాయి రిజిస్ట్రేషన్ల ఆఫీసులు. గంటల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించకతప్పడం లేదు. మరో రెండురోజుల తర్వాత ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే స్లాట్ లు బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సాధారణ వినియోగదారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థలాలు కొనుగోలుచేయడం భారంగా మారుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో సంచలనం కలిగించిన సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు వ్యవహారంపై దృష్టి సారించింది ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. స్థిరాస్తి వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గచ్చిబౌలి 7, నార్సింగి, రాయదుర్గం పీఎస్ లో కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. మొత్తం సైబరాబాద్ లో 13 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో మూడు కేసులు సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్…