TGIIC : రాయదుర్గం భూములకు జాక్‌పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
- ఎకరాకు రూ.269 కోట్ల రికార్డు ధర
- 5.38 ఎకరాల ప్లాట్‌కు రూ.1,447 కోట్లు
- వారం రోజుల్లోనే రూ.2,833 కోట్ల ఆదాయం
- ఇన్వెస్టర్లకు హైదరాబాద్‌పై భారీ నమ్మకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGIIC : హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ రాయదుర్గంలో నిర్వహించిన భూముల ఈ-వేలానికి పెట్టుబడిదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం ప్రక్రియలో ప్రతిపాదిత రిజర్వ్ ధర కంటే ఏకంగా 52.3 శాతం అధిక ధరకు భూములు విక్రయమయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో ఉన్న మెరుగైన మౌలిక వసతులు, రవాణా అనుసంధానం , వ్యాపార అనుకూల వాతావరణం కారణంగానే ఈ స్థాయిలో డిమాండ్ పెరిగిందని అధికారులు తెలిపారు.
వారంలోనే వేలంలో సరికొత్త రికార్డులు
తాజాగా నిర్వహించిన 5.38 ఎకరాల ‘ప్లాట్-P2’ వేలంలో ఎకరాకు ఏకంగా రూ.269 కోట్ల ధర పలకడంతో మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు గత వారం జరిగిన ‘ప్లాట్-P1’ వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల చొప్పున రూ.1,386 కోట్లు వచ్చాయి. మొదటి ప్లాట్‌కు సంబంధించిన 25 శాతం తొలి విడత నిధులు కూడా ఇప్పటికే టీజీఐఐసీ ఖాతాకు చేరాయి. ఇలా వారం రోజుల వ్యవధిలోనే ఈ రెండు ప్లాట్లకు (మొత్తం 10.63 ఎకరాలు) సంబంధించి రూ.2,833.22 కోట్ల భారీ రాబడి లభించింది. ఈ వేలంలో సగటున ఎకరా ధర రూ.266.53 కోట్లుగా నమోదవడం విశేషం.
Also Read
ప్రభుత్వ విధానాలకు దక్కిన నమ్మకం
ఎమ్‌ఎస్‌టీసీ ఈ-ఆక్షన్ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన ఈ ప్రక్రియకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సలహా సంస్థ ‘జేఎల్ఎల్’ వ్యవహరించింది. ఈ సక్సెస్ పై టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక ఐఏఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఈ రికార్డు ధరలే నిదర్శనమన్నారు. పారదర్శక విధానాల ద్వారా ప్రభుత్వ ఆస్తులకు గరిష్ట విలువను సమకూర్చడంలో రాయదుర్గం వేలం ఒక మైలురాయిగా నిలిచిందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
TGIIC : రాయదుర్గం భూములకు జాక్‌పాట్.. రూ.2,833 కోట్ల రాబడి
-
Ram Mohan Naidu: ‘పీ4’ విధానంలో శ్రీకాకుళం జిల్లాకు ‘ఎ’ గ్రేడ్.. ప్రశంసించిన కేంద్ర మంత్రి..
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!