Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
- డెలివరీకి వెళ్తుండగా విషాదం
- వెనుక నుంచి ఢీకొట్టి పరార్
- సీసీటీవీ ఫుటేజ్‌తో వేట
- డ్రైవర్ కోసం పోలీసుల గాలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hit and Run : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నార్సింగి ప్రధాన రహదారిపై చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఒక డెలివరీ బాయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం బైక్‌ను తీవ్రంగా ఢీకొట్టడమే కాకుండా, వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారైంది.
డెలివరీకి వెళ్తుండగా ప్రమాదం.. ఫుట్‌పాత్‌పై పడి అక్కడికక్కడే మృతి
హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే యువకుడు ‘ఫస్ట్ క్లబ్’ (First Club) సంస్థలో డెలివరీ బాయ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల నిర్వహణలో భాగంగా నార్సింగి నుండి గండిపేట వైపు ఆర్డర్ డెలివరీ తీసుకొని బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వెనుక నుండి వచ్చిన అపరిచిత వాహనం సమద్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్‌కు బైక్ అదుపుతప్పి ఫుట్‌పాత్‌పై పడటంతో సమద్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read
సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని, డ్రైవర్‌ను గుర్తించేందుకు రహదారిపై ఉన్న సిసిటీవీ (CCTV) ఫుటేజ్‌ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!