Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సుబ్రహ్మణ్యపురం’ లాంటి హిట్ తర్వాత హీరో సుమంత్, డైరెక్టర్ సంతోష్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ వేదికపై హీరో సుమంత్ ఒక మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్‌ను లీక్ చేసి ఆడియన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే.. ఈ సినిమాలో క్రేజీ యూత్ సెన్సేషన్ ‘డీజే టిల్లు’ (సిద్ధు జొన్నలగడ్డ) ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు! ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టని చిత్ర బృందం, నేరుగా ట్రైలర్లోనే రివీల్ చేసి సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ట్రైలర్ లాంచ్‌లో సుమంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో మా డీజే టిల్లు ఉన్నాడని మీరెవరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. తను చాలా కీలకమైన పాత్ర పోషించాడు.
ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ సంతోష్ దాదాపు మూడేళ్లు ట్రావెల్ అయ్యాం. ఇది చాలా పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కాల్సిన సినిమా కావడంతో సరైన నిర్మాతల కోసం వెయిట్ చేశాం. మా నిర్మాతలు మధు, లక్ష్మణ్ గారు మా వెన్నంటే ఉండి ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు” అని చెప్పుకొచ్చారు. తాను చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తినని, కానీ ఈ సినిమాపై తనకు వంద శాతం బలమైన నమ్మకం ఉందని సెప్టెంబర్ 11న థియేటర్లలో మీరే ఆ రిజల్ట్ చూస్తారని ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరిపై సుమంత్ ప్రశంసల వర్షం కురిపించారు. వెంకీ తెరకెక్కించిన ‘విశ్వనాథన్ సన్స్’ చిత్రం ఫస్ట్ హాఫ్ రైటింగ్ పరంగా ఒక టెక్స్ట్ బుక్ లాంటిదని, గత పదేళ్లలో ఆ జానర్లో తాను చూసిన టాప్ 10 సినిమాల్లో అదొకటని కొనియాడారు. మొత్తానికి సుమంత్ అపారమైన నమ్మకానికి తోడు.. డీజే టిల్లు క్రేజ్ కూడా యాడ్ అవ్వడంతో సెప్టెంబర్ 11న థియేటర్లలో ‘మహేంద్రగిరి వారాహి’ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాస్ట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది!
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!