Robbery : బస్సులో దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
- అమరావతి బస్సులో దంపతుల బ్యాగ్‌కు కన్నం
- లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు చోరీ
- బుకింగ్ ఐడీలతో నిందితుల కోసం పోలీసుల గాలింపు
- గచ్చిబౌలి ఘటనపై కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో ఒక బస్సులో భారీ దోపిడీ జరిగింది. ఆర్టీసీ అమరావతి బస్సులో ప్రయాణిస్తున్న ఒక దంపతుల బ్యాగ్‌ను టార్గెట్ చేసిన దుండగులు, అందులోని రూ.లక్షల విలువైన బంగారం , వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. కొండాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ సి. శ్రీధర్ బాబు తన భార్యతో కలిసి ఆల్విన్ ఎక్స్ రోడ్స్ నుండి గుంటూరులోని SVN కాలనీకి అమరావతి బస్సు (AP 4219) లో బయలుదేరారు. ప్రయాణంలో భాగంగా వారు తమ వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో ఒక ప్లాస్టిక్ డబ్బాను ఉంచారు. అందులో ఒక అన్‌కట్ డైమండ్ నెక్లెస్, ఒక బంగారు గాజు , ఒక బంగారు కమ్మ ఉన్నాయి. ప్రయాణికుల కన్నుగప్పి చాకచక్యంగా బ్యాగ్ జిప్ తీసిన దొంగల ముఠా, లోపలి నగలను కొట్టేసి బ్యాగ్‌ను ఏమీ తెలియనట్లు యథావిధిగా పక్కన పెట్టేశారు.
బుకింగ్ ఐడీ ఆధారంగా పోలీసుల గాలింపు
గమ్యస్థానానికి చేరుకున్నాక నగలు మాయమైనట్లు గుర్తించిన శ్రీధర్ బాబు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వెనుక సీట్లలో ప్రయాణించిన వాజిద్ (42), జబీద్ (28) అనే వ్యక్తులపై బాధితుడు అనుమానం వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల బుకింగ్ ఐడీల ఆధారంగా వారి లైవ్ లొకేషన్‌ను ట్రైస్ చేస్తూ గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!