TGIIC : తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో భూముల ధరలు రికార్డు సృష్టించాయి. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఒక ఎకరం భూమికి చదరపు గజానికి రూ.3,40,000 ల చొప్పున గణనీయమైన ధర పలికింది. చదరపు గజానికి ₹3,40,000 ల చారిత్రాత్మక ధరతో ఈ వేలం మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. గతంలో, 2017లో చదరపు గజానికి రూ.88,000 ల ధర నమోదైంది. ఈ కొత్త ధర…
Harish Rao : కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ మాజీ మంత్రి టీ. హరీష్ రావు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న విధానంపై ప్రశ్నలెత్తుతూ, కేంద్ర కమిటీకి అవసరమైన డాక్యుమెంట్లు అందించామని తెలిపారు. “ఎవరైనా చెట్టు నరకాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. వాల్టా చట్టం ప్రకారం కూడా చెట్లు రక్షించాల్సిందే,” అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం స్వయంగా చెట్లు నరికిందని ఆరోపించారు. ఈ విషయంలో TGIIC స్వయంగా పోలీసులను సంప్రదించి రక్షణ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోని అతిపెద్ద ఎకో పార్క్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పరిధిలోని 400 ఎకరాలు మాత్రమే కాకుండా, మొత్తం 1600 ఎకరాలను కూడా కలిపి 2000 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో ఈ ఎకో పార్క్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై…
HCU Land Issue: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. ఈ వ్యవహారంపై విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయిన TGIIC (Telangana State Industrial Infrastructure Corporation) ఇచ్చిన ప్రకటనను ఖండించింది. HCU తెలిపిన ప్రకారం, 400 ఎకరాల భూమిని గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి సర్వే నిర్వహించలేదని వెల్లడించింది. జూలై 2024లో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సర్వే జరిగిందన్న వార్తలను…