Rapolu Ananda Bhaskar: బీఆర్ఎస్ కి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా చేశారు. రాజీనామాను లేఖను కేసీఆర్ కి పంపారు. రాపోలు ఆనంద భాస్కర్ తో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు తీగల లక్ష్మణ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. విధిలేని పరిస్థితిలో కీలక నిర్ణయం తీసుకున్నా అని రాపోలు పేర్కొన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితిలో నా లాంటి నేతలు ఉన్నారని తెలిపారు. 2022 లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లో చేరా అని తెలిపారు.
Read also: Budi Mutyala Naidu: డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర డ్రోన్ల కలకలం..
ప్రాంతీయ ఉద్యమ పార్టీ నుంచి ఇక నా అనుబంధాన్ని తుంచుకుంటున్నానని తెలిపారు. తాను బీఆర్ఎస్ లో చేరినప్పుడు కేసీఆర్ ఇచ్చిన బీఆర్ఎస్ కండువాను హైదరాబాద్ తెలంగాణ భవన్ కి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపానని రాపోలు వ్యాఖ్యానించారు. తెలంగాణ సబ్బండ వర్గాల కోసం పోరాడేలా నా భవిష్యత్తు కార్యచరణ ఉంటుందన్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం ప్రగతి పరిరక్షణ కోసం ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తా అన్నారు. కుల జన గణన అంశం ఉద్యమాల్లో నా పాత్ర ఉంటుందన్నారు. కేసీఆర్ గణాంకాల కోసం సకల క్జనుల సర్వే మాత్రమే చేశారన్నారు.
Read also: NASA : గ్రహాంతరవాసులు ఉన్నట్లేనా.. 22 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్
రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తుంది ..కుల జన గణన దిశగా అడుగులు వేస్తుందన్నారు. నేను ఉద్యమాల వెంట ఉండే వ్యక్తిని అని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కొందరికి కంటగింపుగా ఉందన్నారు. తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధిని ఓర్చుకోలేక పోతున్నారని తెలిపారు. నేను ఎవరిపైనా విమర్శలు చేయను..నాకున్న సమాచారం మేరకు ప్రజలను జాగరుకం చేస్తున్నానని అన్నారు. హైదరాబాద్ అంశాన్ని రేవంత్ రెడ్డి, కేసీఆర్ అందరి దృష్టికి తీసుకువెళతా అన్నారు. ఏ పార్టీలోకి వెళతా అనేది చెప్పలేను.. ప్రజా ఉద్యమాల్లో ఉంటా అని క్లారిటీ ఇచ్చారు.
B. Vinod Kumar: అభివృద్ధి కావాలా.. విధ్వంసం కావాలా.. ప్రజలు తేల్చుకోవాలి..