B. Vinod Kumar: అభివృద్ధి కావాల్నా విధ్వంసం కావాలా ప్రజలు తేల్చుకోవాలని బీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రభుత్వం వచ్చిందన్నారు. ఇది కొత్త ప్రభుత్వం కాదన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుందన్నారు. రేవంత్ రెడ్డి గెలిస్తే పథకాలు అమలు చేస్తానన్నాడు. మళ్లీ గెలిస్తే అమలు చేయడన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకే పడుతుందన్నారు.
Read also: Mumbai: ఎయిర్‌పోర్టులో 12 కోట్ల విలువైన గోల్డ్, ఫోన్లు పట్టివేత
అభివృద్ధి కావాల్నా విధ్వంసం కావాలా ప్రజలు తేల్చుకోవాలన్నారు. నేను గెలిచిన తరువాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నారు. నేను చెప్పింది చేసి చూపించానని తెలిపారు. కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ లు అని మండిపడ్డారు. అంతేకాకుండా.. బీఆర్‌ఎస్ పాలనలో కరెంటు ఎందుకు పోలేదు.. ఇప్పుడు ఎందుకు పోతున్నదని ప్రశ్నించారు. దీంతో ఇండ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నారని అన్నారు.
Read also: Rahul Gandhi vs Priyanka: ప్రియాంక గాంధీని రాహల్ తొక్కేస్తున్నాడు..
కరీంనగర్ జిల్లా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తల వల్ల నేను ఎన్నికల్లో బయట పడ్డ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గంప గుత్తగా కొనుక్కొందన్నారు. 4 రోజుల క్రితం బీఆర్ఎస్ కి ప్రచారం చేసిన వాళ్ళు ఈ రోజు జై కాంగ్రెస్ అంటున్నారని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలు, మోసం చేయడం కరెక్టా.. ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో చేరిన వాళ్లు ఒక్కరు కార్పొరేటర్లుగా గెలవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. 99% ఎవరు పార్టీ మారే అవకాశం లేదన్నారు.
Delhi : పాలలో ఆక్సీటోసిన్.. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన నివేదికలో షాకింగ్ నిజాలు