శంషాబాద్‌లో దారుణం : ఆ పని చేశారని.. స్తంభానికి కట్టేసి గుండుకొట్టారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. బ్యాటరీలను దొంగతనం చేసారంటూ ఇద్దరు యువకులను కరెంటు స్తంభానికు కట్టివేసి గుండు కొట్టించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. జరిగిన అవమానంతో బాధితులు స్థానిక ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ లోని అహ్మద్ నగర్ లో నివాసం ఉంటున్న మహమ్మద్ ఖుద్దూస్, ఎండి ఖాజాలు స్క్రాప్ బిజినెస్ చేస్తుంటారు. స్క్రాప్ బిజినెస్ తోపాటు చిన్న చిన్న దొంగతనాలు చేస్తారనే ఆరోపణలున్నాయి. కాగా గత కొంత కాలంగా అహ్మద్ నగర్ లో వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు దొంగతనానికి గురవుతున్నాయి.
అలా చోరీ కాబడిన బ్యాటరీలు అదే కాలనీలో ఉంటున్న ఎండి ఖాజా అనే యువకుడి ఇంటిలో దొరికాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖుద్దూస్ తో కలిసి ఖాజా బ్యాటరీలు దొంగిలించారనే కారణంతో అహ్మద్ కాలనీకి చెందిన కొంతమంది ఖుద్దూస్, ఖాజా లను బలవంతంగా స్థానిక మదీనా మసీదు సమీపంలోకి తీసుకొని వచ్చి అక్కడ కరెంటు స్తంభానికి కట్టివేసారు. ఖాజా ఇంటిలో దొరికిన బ్యాటరీలను ను ఖుద్దూస్, ఖాజాల మెడలో వేసి ఇద్దరికీ గుండు కొట్టించారు. జరిగిన అవమానంతో బాధితులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అలీ, ఎండి జావేద్, ఎండి గౌస్, ఎండి భారీ ల పై కేసు నమోదు చేసుకున్న ఎయిర్ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read
- ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
తాజావార్తలు
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
-
Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 21 మంది విద్యార్థులు, టీచర్ మృతి
-
Anupama: హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!