Bharat Jodo Yatra: నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ సాయంత్రం 5గంటలలోపు మక్తల్ చేరుకోనున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ. రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది. కన్యకాపరమేశ్వరి ఆలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు రాహుల్ పాదయాత్ర సాగనుంది. బండ్లగుంట వద్ద రాహుల్ లంచ్ అనంరతం రాత్రి గుడిగండ్ల గ్రామంలో రాహుల్ సభ నిర్వహించనున్నారు. మొదటిరోజు 26 కి.మీ రాహుల్ పాదయాత్ర సాగనుంది.
Read also: Govardhan Puja 2022 Special LIVE : గోవర్ధనపూజ సందర్భంగా ఈ స్తోత్రం వింటే చాలు..
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర ఆదివారం తెలంగాణ లోకి ప్రవేశించింది. రాయచూర్ యర్మరస్ నుండి మహబూబ్ నగర్ జిల్లా థాయ్ రోడ్ సర్కిల్ వరకు రాహుల్ యాత్ర సాగింది. ఆదివారం దాదాపు 13 కిలోమీటర్ల మేర సాగింది. కృష్ణ నది బ్రిడ్జి మీద రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు . రాహుల్ గాందీకి రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్ ఘనస్వాగతం పలికారు. డికే శివకుమార్ నుంచి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను తీసుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. నారాయణ పేట టై రోడ్ నుంచి హెలికాప్టర్ లో బేగంపేటకి రాహుల్ గాంధీ వెళ్లారు.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ ఢిల్లీకి వెల్లారు. 24, 25 దీపావళి, 26 న ఖర్గే ప్రమాణ స్వీకారం రాహుల్ హాజరై అనంతరం ఇవాళ హైదరాబాద్ నుంచి మక్తల్ కు సాయంత్రం 5గంటల లోపు చేరుకోనున్నారు. రేపు 27న న జొడో యాత్ర మళ్లీ షురూ కానున్నడంతో.. కాంగ్రెస్ నేతల్లో జోష్ మొదలైంది.
Karthika Budhavaram 2022 Special LIVE : తొలి కార్తిక బుధవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అన్ని శుభాలే..