కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుంది: మంత్రి నిరంజన్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బంధు సంబరాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటూ అటు పార్టీ కార్యకర్తలను, రైతులను ఉత్సాహ పరుస్తున్నారు. కాగా మరోవైపు ప్రభుత్వం రైతుబంధు సంబంధించిన అంశాలను రైతులకు వివరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలోని నారాయణపురం గ్రామంలో జరిగని రైతు బంధు కార్యక్రామానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. విత్తనాలను మొలకెత్తించి వాటిలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించటం సాధారణమైన విషయం కాదని మంత్రి అన్నారు. వారం రోజులుగా రైతు బంధు వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా పండుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులు స్వచ్ఛంధంగా బయటకు వచ్చి రైతుబంధు సంబరాల్లో పాల్గొంటున్నారన్నారు. వినూత్న రీతిలో ప్రజలు ఇళ్ల ముందు ముగ్గులు వేసి రైతు బంధు అందించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వెల్లడించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో రైతు వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తుందని మండిపడ్డారు. 50 వేల600 కోట్ల రూపాయాలను రైతు బంధు ద్వారా పేదలకు పెట్టుబడి రూంలో అందించామని తెలిపారు.

Read Also: రూల్స్‌ బ్రేక్‌ చేస్తున్న ప్రజాప్రతినిధులు

ప్రతి ఏటా సగటున 60వేల కోట్ల రూపాయలను రాష్ట్రంలోని రైతాంగం కోసం ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. 15నెలల పాటు లక్షల మంది రైతులు ఢిల్లీ చుట్టూ చేరి నల్ల చట్టాల ఉపసంహరణ కోసం పోరాటాలు చేశారన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని రైతులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.ప్రజల చేతుల్లో ఉన్న ఆహార రంగాన్ని కార్పొరేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని దీన్ని తిప్పికొట్టాలన్నారు. సాగు నీటిని ఉచితంగా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. సత్తుపల్లి ప్రాంత ఫామాయిల్‌ రైతుల అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.

ట్రాక్టర్‌ నడిపిన సబితా ఇంద్రారెడ్డి..
రైతుబంధు సంబరాల్లో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రాక్టర్‌నడిపారు. మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో రైతు సంబరాల్లో పాల్గొని ఎడ్ల బండి, ట్రాక్టర్ పై ర్యాలీ నిర్వహించారు. దీంతో తమతో ట్రాక్టర్‌, ఎడ్లబండిలో మంత్రి రావడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles