Nizamabad Ragging: తిరుమల విద్యాసంస్థలో ర్యాగింగ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizamabad Ragging: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైనెన్స్ కాలేజీ లో ర్యాగింగ్ భూతం మళ్లీ పడగవిప్పింది. కాగా.. బీ ఫార్మసీ సెకండియర్ చదువుతున్న తమను సీనియర్స్ ర్యాగింగ్ పేరిట వేధిస్తున్నారని కాలేజీలో అమ్మాయిలు ఆందోళన చేశారు. కాలేజీ కి సంబంధంలేని వాళ్లు కూడా క్యాంపస్‌లోకి వస్తున్నారన్నారు. మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది తల్లిదండ్రులకు విషయం తెలియడంతో అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి స్టూడెంట్స్ తో పాటు వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి పంపించారు. ర్యాగింగ్ చేస్తున్న నలుగురు స్టూడెంట్స్ లను అదుపులోకి తీసుకున్నారు. గొడవలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని కరస్పాండెంట్ పద్మ తెలిపారు. ర్యాగింగ్ ఆరోపణలతో యాజమాన్యం నలుగురు సీనియర్లను 10 రోజుల పాటు సస్పెండ్ చేసింది.
Read also: Air Cooler: వేసవిలో ఎయిర్ కూలర్ కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
పోలీసుల తీరుపై విద్యార్థినుల ఆగ్రహం..
అయితే.. పోలీసుల తీరుపై విద్యార్థినుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల విద్యాసంస్థలో ర్యాగింగ్ చేసిన స్టూడెంట్స్ ను అదుపు తీసుకుని వదిలేయడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మసీ కళాశాలలో జరిగింది ర్యాగింగ్ కాదు, గొడవ అంటూ పోలీసులు చెబుతున్నారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ర్యాగింగ్ విషయంలో లిఖితపూర్వకంగా పిర్యాదు అందలేదంటున్నారు. అదుపులో తీసుకున్న సమయంలో జూనియర్ విద్యార్థినిలు సీనియర్లపై చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసిరి ఆగ్రహాం వ్యక్తం చేశారని పోలీసులు తెలిపారు. అయితే సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని తెలిపిన పోలీసులు మాత్రం వారిని వదిలిపెట్టడం ఏంటని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏదో మతలబు దాగుందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వారిని వదిలేసారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైనెన్స్ కాలేజీ యాజమాన్యం, పోలీసులు ఏం వివరన ఇవ్వనున్నారు?మరి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పోలీసులు తీరుపై నిరసన తెలుపుతారా? అనే దానిపై సర్వత్రా ఉల్కంఠ నెలకొంది.
Air Cooler: వేసవిలో ఎయిర్ కూలర్ కొంటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!