చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ‘ ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. దీని సాధన కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్ లో బీసీల న్యాయపరమైన డిమాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు.…