హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ దవాఖానలో గురువారం నర్సింగ్ కాలేజీని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఆర్టీసీ క్లిష్ట పరిస్థితులను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ప్రారంభం శుభపరిమాణం అని, దవాఖానను మరింత బలోపేతం చేయాలని ఆయన అన్నారు. ఆర్టీసీ సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే కొత్త ఈ-బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
రోజురోజుకు డీజిల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సులు వాడకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలు వాట్‌ను తగ్గించానలని సూచించడం సబబు కాదన్నారు. కేంద్రం లాభాల బాటలో ఉన్న సంస్థలను అమ్మకానికి పెడుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.