హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ దవాఖానలో గురువారం నర్సింగ్ కాలేజీని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఆర్టీసీ క్లిష్ట పరిస్థితులను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ప్రారంభం శుభపరిమాణం అని, దవాఖానను మరింత బలోపేతం చేయాలని ఆయన అన్నారు. ఆర్టీసీ సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే కొత్త ఈ-బస్సులు కొనుగోలు చేస్తున్నామని…