రైతులకు పంట రుణాలు అందించడంపై తెలంగాణ సర్కార్ ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి టి. హరీష్ రావు బ్యాంకర్లను కోరారు. సోమవారం బి.ఆర్. కె.ఆర్ భవన్ లో SLBC 29 వ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో 2021-22 సంవత్సరానికి సంబంధించి 1,86,035.60 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ను ఆమోదించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నదని, ఒక వారంలో దాదాపు 61 లక్షల మంది పైగా రైతుల ఖాతాలలో 7360 కోట్లు పైగా జమ చేశామని తెలిపారు. రైతు బంధు ద్వారా ప్రభుత్వం అందించిన సహాయంతో ఇతర రుణాలకు మళ్లించకుండా వారి సేవింగ్ అకౌంట్లలో జమ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీచేశారని, బ్యాంకులకు ఈ ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
బ్యాంకర్లు పంటరుణాలను సకాలంలో జాప్యం లేకుండా వారికి అందేలా చూడాలని మంత్రి కోరారు. తద్వారా రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తారన్నారు. కోవిడ్ సమయంలో బ్యాంకర్లు తమ సేవలు అందించాయని, బ్యాంకింగ్ సిబ్బందికందరికి వ్యాక్సినేషన్ కు చర్యలు తీసుకున్నామని తెలిపారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు మరింత ముద్రా రుణాలను అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని బ్యాంకర్లకు తెలిపారు.
Also Read
- Work From Bike: వర్క్ ఫ్రం హోం పోయింది.. వర్క్ ఫ్రం బైక్ వచ్చేసింది.. వీడియో వైరల్..
- Hyderabd Weather Update : హైదరాబాద్‌లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
- Bhatti Vikramarka : ఆలయాల అభివృద్ధికి రూ. 2,216 కోట్లు.. భట్టి కీలక ప్రకటన
- Hyderabad: వనస్థలిపురంలో అక్రమ 'లింగ నిర్ధారణ' రాకెట్ భగ్నం.!
- Tags
- Farmers
- harish rao
తాజావార్తలు
-
Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
-
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్‌తో భారత్‌పై బద్దలైన రికార్డులు…
-
Jaishankar-Rubio: హార్ముజ్‌లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్‌కు రూబియో సూచన
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!