Harish Rao: కాంగ్రెస్ వచ్చాక బంగారం ధర, నిత్యవసర ధరలు పెరిగాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ జరిగే ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలు అన్నారు. ప్రాజెక్టులు కట్టింది మనం పనులు చేసింది మనం కాంగ్రెస్ అడ్డొచ్చిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా గౌరవెల్లి ప్రాజెక్టుకు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి ప్రాజెక్టు ను పూర్తి చేశామని తెలిపారు. బండి సంజయ్ గెలిచి ఐదు సంవత్సరాలు అయితుంది మోడీ గవర్నమెంట్ నుండి ఒక రూపాయి తేలేదన్నారు. కాంగ్రెస్, బిజెపి ఇద్దరు కూడా దొందు దొందే ఇద్దరు రైతు వ్యతిరేకులు, కేసిఆర్ ను గెలిపిస్తేనే మనకు న్యాయం జరుగుతుందన్నారు.
Read also: Rohit Sharma: మీడియా సమావేశం.. నేనున్నానంటూ చేతెత్తిన రోహిత్ శర్మ!
10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మోటర్లు కాలలేదు, కాంగ్రెస్ వచ్చి నాలుగు నెలలు అవుతుంది మోటర్లు కాలుతున్నాయన్నారు. కాంగ్రెస్ వాళ్లు లంబాడి వాళ్లకు మంత్రి పదవి ఇచ్చిండా కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలు చేసిండు లంబాడీలకు మంత్రి పదవి ఇచ్చి గిరిజనులకు గౌరవాన్ని పెంచాడన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంతా అబద్ధమే జూట మాటలు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలు పై బాండ్ పేపర్లు రాసిచ్చి అమలు చేయనందుకు వీళ్లకు శిక్ష పడాలని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక బంగారం ధర, నిత్యవసర ధరలు పెరిగాయన్నారు. హైదరాబాద్ రాజధానిని అభివృద్ధి చెయ్యకుండా చంద్రబాబు నాయుడుతో కలిసి శిష్యుడు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తెలిపారు.
Google Chrome: గూగుల్ క్రోమ్ వాడే వారు జాగ్రత్త.. ఇలా చేయకపోతే అంతే..!