Chicago: చికాగోలో హీరోయిన్స్‌తో దందా.. దోషిగా తేలిన ఆ నిర్మాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చికాగోలో రహస్యంగా నడిపిస్తున్న వ్యభిచారం దందాలో నిర్మాత మోదుగుమూడి కిషన్, భార్య చంద్రకళను కోర్టు దోషులుగా నిర్ధారించింది. తెలుగు యాంకర్లతో పాటు హీరోయిన్లతోనూ వీళ్ళు ఈ చీకటి దందాను నడిపిస్తున్నట్టు కోర్టు తేల్చింది. వీరికి 27 ఏళ్ల నుంచి 34 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇండియా నుంచి హీరోయిన్లు సహా యాంకర్లను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణలతో 2018లో పోలీసులు ఈ దంపతుల్ని అరెస్ట్ చేశారు. రెండేళ్ల సుధీర్ఘ విచారణ తర్వాత కోర్టు వీరిని దోషులుగా తేల్చుతూ తీర్పునిచ్చింది. పలు సినిమాలకు సహ-నిర్మాతగా వ్యవహరించిన కిషన్.. 2014లోనే అమెరికాకు రావాలని ప్రయత్నించాడు. కానీ, అప్పుడు నకిలీ పత్రాలు సమర్పించడంతో వీసా లభించలేదు.
2015లో మాత్రం ఎలాగోలా వీసా సాధించిన ఈయన.. తన భార్యతో అక్కడికి వెళ్లాడు. వీసా సమయం గడువు ముగిసినప్పటికీ, అక్రమంగా అక్కడే నివసిస్తూ వస్తున్నాడు. ఓ వ్యభిచారం రాకెట్‌ను పోలీసులు రట్టు చేసినప్పుడు.. కిషన్ రహస్యాలు బట్టబయలయ్యాయి. ఈవెంట్లకు వచ్చిన వారితో ఒప్పందాలు కుదుర్చుకొని, ఈయన వ్యభిచారం నడిపేవాడని తేలింది. డబ్బులు ఆర్జించేందుకు కొందరు హీరోయిన్లు ప్రత్యేకంగా ఈ దందాలో భాగం అవ్వడం కోసమే ఇండియా నుంచి అమెరికాకు వచ్చేవారని తెలిసింది. ఇలాంటి వారికి ఈవెంట్ల పేరుతో ముందుగానే ఆహ్వానం పంపించేవారని, ప్రత్యేక వాహనాలతో పాటు హోటల్స్ సిద్ధం చేసేవారని బహిర్గతమైంది. విటుల నుంచి రెండు నుంచి మూడు వేల డాలర్ల వరకు వసూలు చేసేవారు. ఆ హీరోయిన్లలో చాలామంది ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నావారే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలింది.
Also Read
- Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
- FIFA ఫైనల్లో ట్రంప్‌కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
- US - Iran War: ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా.. వరుస దాడులతో ఉద్రిక్తత.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- JD Vance Fourth Child: నాలుగోసారి తండ్రైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో అరుదైన ఘట్టం
తాజావార్తలు
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!